ఏమైందో ఏమో గాని టీడీపీలో యువ నాయకురాలు బండారు శ్రావణి దూకుడు తగ్గింది. అసలు అప్పటివరకు శింగనమల నియోజకవర్గంలో యాక్టివ్‌గా పనిచేసుకుంటూ వచ్చిన ఆమె..సడన్‌గా సైలెంట్ అయ్యారు. ఇక కొన్ని రోజులు పూర్తిగా సైలెంట్ అయిపోయిన ఆమె…ఇటీవల సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు తప్ప…నియోజకవర్గంలో యాక్టివ్‌గా తిరుగుతున్నట్లు కనిపించడం లేదు. అయితే ఎంతో యాక్టివ్‌గా ఉండే శ్రావణి వెనక్కి తగ్గడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు శింగనమల రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.

శ్రావణినే సైలెంట్ అయ్యారా? లేక ఆమెని ఎవరన్నా సైలెంట్ చేశారా? అనేది తెలియడం లేదు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా సరే ఆమె…వెంటనే నియోజకవర్గంలో అడుగుపెట్టి కార్యకర్తలకు అండగా నిలిచారు. పార్టీని మళ్ళీ బలోపేతం చేయడానికి కృషి చేశారు. అలా దూకుడుగా పనిచేస్తూ వస్తున్న శ్రావణి…అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులు ఎఫెక్ట్‌తో సడన్‌గా సైలెంట్ అయ్యారు.

ఎస్సీ స్థానమైన శింగనమలలో అగ్రవర్గాల వారికి పదవులు ఇచ్చారని చెప్పి శ్రావణి, కాల్వతో వాదించిన విషయం తెలిసిందే. అలాగే దీనిపై టీడీపీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. అలాగే శ్రావణి అనుచరులు లోకేష్‌కు కూడా చెప్పాలని చూశారు. ఇక అంతే ఆ తర్వాత ఏమైందో ఎవరికి క్లారిటీ లేరు. ఆమె పూర్తిగా సైలెంట్ అయిపోయారు. కొన్ని రోజులు సోషల్ మీడియాలో కూడా కనిపించలేదు. కాకపోతే ఇటీవల కాస్త సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ పార్టీలో యాక్టివ్‌గా పనిచేయడం లేదు. తాజాగా టీడీపీ మహిళా నేతలు నారీభేరి సభ నిర్వహించారు. ఆ సభలో శ్రావణి కనిపించలేదు.

అంటే కాల్వ వైఖరిపై ఆమె అసంతృప్తిగా ఉండి…ఇలా సైలెంట్‌గా ఉంటున్నారా? లేక సీనియర్ నేతలే..ఆమెని సైలెంట్ అయ్యేలా చేశారా? అనేది ఏ మాత్రం క్లారిటీ లేదు. మరి ఆమె రానున్న రోజుల్లో యాక్టివ్ అవుతారా? లేక ఇలాగే సైలెంట్‌గా ఉండిపోతారో చూడాలి.
Discussion about this post