రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి..మొన్నటివరకు అధికార వైసీపీకి అనుకూలంగా ఉన్న పరిస్తితులు..నిదానంగా టీడీపీకి అనుకూలంగా మారుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం, అదే సమయంలో టీడీపీ నేతలు పికప్ అవుతుండటంతో…కొన్ని స్థానాల్లో సీన్ మారిపోతుంది. టీడీపీకి అనుకూలమైన పరిస్తితులు కనిపిస్తున్నాయి. పైగా టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటున్న నేపథ్యంలో వైసీపీకి ఇంకా రిస్క్ పెరుగుతుంది.

ఇదే క్రమంలో కృష్ణా జిల్లా కేంద్రంగా ఉన్న మచిలీపట్నం(బందరు)లో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి. బందరు ఎమ్మెల్యే, ఎంపీ స్థానంలో టీడీపీ బలపడుతుంది. గత ఎన్నికల్లో కేవలం జనసేన ఓట్లు చీల్చడం వల్లే అటు బందరు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో టీడీపీ ఓడిపోవడం, వైసీపీ గెలవడం జరిగింది. కానీ నెక్స్ట్ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యేలా ఉంది. టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖాయం కావడంతో..ఆ రెండు సీట్లలో వైసీపీ గెలుపు కష్టమయ్యేలా ఉంది.

దాంతో పాటు బందరు ఎమ్మెల్యేగా ఉన్న పేర్ని నాని, బందరు ఎంపీగా ఉన్న బాలశౌరిలపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగానే కనిపిస్తోంది. పైగా వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరుకు వైసీపీకి డ్యామేజ్ చేసేలా ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో బందరు ఎమ్మెల్యేగా నాని బదులు, ఆయన తనయుడు కృష్ణమూర్తి నిలబడతారని తెలుస్తోంది. వారసుడుని నిలబెట్టిన సరే ఈ సారి బందరులో వైసీపీ గెలుపు ఈజీ కాదని తెలుస్తోంది. అటు బందరు ఎంపీ సీటులో కూడా వైసీపీ గెలుపు డౌటే అనే పరిస్తితి. టీడీపీ-జనసేన పొత్తు ఉంటే డౌట్ లేకుండా ఆ రెండు సీట్లలో వైసీపీ గెలవడం కష్టమే.


