గత ఎన్నికల్లో చాలా పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ స్థానాల పరిధిలో ఉన్న 7కి 7 అసెంబ్లీ స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంది. చాలా పార్లమెంట్ స్థానాల్లో అదే పరిస్తితి. కానీ ఈ సారి ఎన్నికల్లో ఆ పరిస్తితి కనిపించడం లేదు. ఓ వైపు టిడిపి పుంజుకుంటుంది. మరోవైపు జనసేనతో పొత్తు ఉంటే డౌట్ లేకుండా వైసీపీకి చుక్కలు కనబడటం ఖాయం.

ఇక టీడీపీ కొన్ని పార్లమెంట్ స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసేలా ఉంది. అలా క్లీన్ స్వీప్‌కు దగ్గరగా ఉన్న స్థానాల్లో బాపట్ల పార్లమెంట్ కూడా ఒకటి. ఈ సారి ఈ స్థానంలో టిడిపి సత్తా చాటేలా ఉంది. బాపట్ల పరిధిలో…అద్దంకి, చీరాల, పర్చూరు, సంతనూతలపాడు, వేమూరు, బాపట్ల, రేపల్లె సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో టిడిపి..అద్దంకి, పర్చూరు, రేపల్లె, చీరాల సీట్లలో గెలిచింది. మిగిలిన సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఇక స్వల్ప మెజారిటీతో బాపట్ల ఎంపీ స్థానాన్ని వైసీపీ గెలుచుకుంది.

అయితే చీరాల టిడిపి ఎమ్మెల్యే కరణం బలరామ్ వైసీపీ వైపుకు వెళ్లారు. దీంతో వైసీపీ బలం 4కు చేరుకుంది. కానీ ఇప్పుడున్న పరిస్తితుల్లో టిడిపి బాపట్లలో పుంజుకుంది. ఈ సారి స్వీప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టిడిపి..అద్దంకి, పర్చూరు, రేపల్లె, వేమూరు, బాపట్ల స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తుంది. కొద్దిగా కష్టపడితే సంతనూతలపాడులో లీడ్ లోకి రావచ్చు.

ఇక చీరాల సీటు విషయంలో క్లారిటీ లేదు. కాకపోతే పొత్తు ఉంటే ఈ సీటుని దక్కించుకునే ఛాన్స్ ఉంది. పొత్తులో భాగంగా చీరాల సీటు జనసేనకు ఇచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదు. చూడాలి మరి బాపట్లలో టిడిపి స్వీప్ చేస్తుందో లేదో.
