వైసీపీకి టీడీపీ శత్రువు కాదు…వైసీపీకి వైసీపీ కూడా శత్రువే అన్నట్లు పరిస్తితి ఉంది. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రతిపక్ష టీడీపీతో కంటే, సొంత పార్టీ వైసీపీ నేతలతోనే పెద్ద తలనొప్పి ఉందని చెప్పొచ్చు. ఒకటి, రెండు కాదు దాదాపు చాలా నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా, సొంత పార్టీ నేతలే రాజకీయం నడిపిస్తున్నారు. కొన్ని చోట్ల అయితే తమ ఎమ్మెల్యేలు అవినీతి, అక్రమాలు చేస్తున్నారని బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు.

అలాగే తమ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు రాజకీయం కూడా చేస్తున్నారు. అయితే అలా వ్యతిరేకంగా వెళ్లడానికి కారణం కూడా కొందరు ఎమ్మెల్యేలే అని చెప్పొచ్చు. సొంత వర్గాన్ని చూసుకుంటూ మిగిలిన నేతలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం, మిగిలిన వర్గాలని కలుపుకోకపోవడం లాంటి చేయడం వల్ల ఇలాంటి పరిస్తితులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్తితి రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో ఉంది.

ఉదాహరణకు గుంటూరు జిల్లాలోని గురజాల, బాపట్ల నియోజకవర్గాలని తీసుకుంటే…ఈ నియోజకవర్గాలో వైసీపీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు పనిచేసే పరిస్తితి. గురజాలలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి వర్గాలకు పడని పరిస్తితి. వాస్తవానికి గురజాల సీటు జంగాదే. గతంలో ఈయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత వైసీపీలోకి వచ్చి 2014లో పోటీ చేసి ఓడిపోయారు. కానీ 2019 ఎన్నికల్లో జగన్, జంగాని పక్కనబెట్టారు. కాసు మహేష్ రెడ్డిని అక్కడ బరిలో దించారు. నిజానికి కాసు సొంత నియోజకవర్గం నరసారావుపేట.


కానీ గురజాలలో పోటీ చేసి గెలిచారు. కాసు ఎమ్మెల్యే అయ్యాక, జంగా వర్గానికి ప్రాధాన్యత తగ్గింది. దీంతో ఎమ్మెల్సీ పదవి వచ్చాక జంగా సెపరేట్‌గా రాజకీయం నడుపుతున్నారు. గురజాలలో ఇప్పుడు కాసు-జంగా వర్గాల మధ్య పోరు నడుస్తోంది. అటు బాపట్లలో ఎమ్మెల్యే కోన రఘుపతి, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి వర్గాలకు పెద్దగా పడటం లేదు. కోనకు వ్యతిరేకంగా గాదె రాజకీయం నడుపుతున్నారు. దీంతో బాపట్లలో ఫ్యాన్ రివర్స్ అయ్యే పరిస్తితి ఉంది.


Discussion about this post