కర్నూలు జిల్లా అంటే టీడీపీకి ఏ మాత్రం కలిసిరాని జిల్లా…మొదట నుంచి జిల్లాలో టీడీపీకి మంచి ఫలితాలు రాలేదు. జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు టీడీపీకి పెద్దగా అనుకూలంగా కూడా ఉండవు. ఏదో రెండు, మూడు తప్ప మిగిలిన నియోజకవర్గాలపై టీడీపీకి పట్టు ఉండదు. అందుకే గత రెండు ఎన్నికల్లోనూ టీడీపీ ఘోరంగా ఓడిపోతూ వస్తుంది.

పైగా ఇప్పుడు జిల్లా మొత్తం వైసీపీ చేతుల్లోనే ఉంది. దీనికితోడు వైసీపీ అధికారంలో ఉంది. దీంతో జిల్లాలో టీడీపీకి అసలు ఛాన్స్ దొరకడం లేదు. కానీ ఇలా బలంగా ఉన్న వైసీపీకి ధీటుగా కొందరు టీడీపీ నాయకులు పనిచేస్తున్నారు. ఎలాగైనా పార్టీని నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే పార్టీ కోసం నిలబెడుతున్నారు. అలా పార్టీ కోసం కష్టపడుతూ….నెక్స్ట్ ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు.అలా పార్టీని నిలబెట్టడానికి కృషి చేస్తున్న వారిలో బీసీ జనార్ధన్ రెడ్డి కూడా ఒకరు. బనగానపల్లెలో బీసీ పార్టీని నిలబెట్టడానికి కష్టపడుతున్నారు. 2014లో జిల్లాలో టీడీపీ సత్తా చాటలేకపోయినా సరే…బనగానపల్లెలో బీసీ సత్తా చాటారు. ఇక 2019 ఎన్నికల్లో జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో వైసీపీకి భారీ మెజారిటీలు వచ్చాయి. కానీ బనగానపల్లెలో భారీ మెజారిటీ రాకుండా బీసీ అడ్డుకట్ట వేశారు. తక్కువ మార్జిన్‌తోనే బీసీ ఓటమి పాలయ్యారు. అలాగే జిల్లాలో ఏ నాయకుడు బయటకు రాకపోయినా సరే బీసీ బయటకొచ్చి పార్టీ కోసం కష్టపడుతున్నారు.

వైసీపీ పలు కేసులు పెట్టి జైలుకు పంపించిన సరే బీసీ వెనక్కి తగ్గకుండా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఈ రెండున్నర ఏళ్లలో బనగానపల్లెలో చాలా వరకు పార్టీని బలోపేతం చేశారు. స్థానిక ఎన్నికల్లో కూడా వైసీపీకి గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పుడు వైసీపీకి చెందిన కార్యకర్తలని వరుసపెట్టి పార్టీలోకి తీసుకొస్తున్నారు. తాజాగా కూడా వైసీపీకి చెందిన 150 కుటుంబాలు టీడీపీలో చేరాయి. అంటే బనగానపల్లెలో సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. ఇక 2024 ఎన్నికల్లో బనగానపల్లెలో బీసీ హవా ఉంటుందని అర్ధమవుతుంది.
Discussion about this post