తెలుగు దేశం పార్టీలో అనేక మంది ఉన్నారు. ఎంతో మంది పార్టీ కోసం పనిచేశారు. పార్టీని అభివృద్ధి పథం లో నడిపించేందుకు కృషి చేశారు. అయితే.. ప్రస్తుత రాష్ట్ర టీడీపీ అధ్యక్షులుగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు మాత్రం వారందరికి భిన్నంగా..పార్టీపై తన ముద్రను స్పష్టంగా వేస్తుండడం గమనా ర్హం. రాజకీయాల్లో ఏ నేతకైనా రెండు రకాల లక్షణాలు ఉండాలి. ఒకటి.. తమ పార్టీని నడిపించడం.. రెండు ప్రత్యర్థి పార్టీ ఆటకట్టించడం. ఈ రెండు లక్షణాలు కూడా అచ్చెన్నకు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకు లు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు దక్కించుకున్న అచ్చెన్న.. పార్టీకి ఆది నుంచి వెన్నెముకగా ఉన్న బీసీ లను సంఘటితంచేసే అంశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న దాడుల ను ఆయన పార్టీ పరంగా తీవ్రంగా ఖండించడమే కాకుండా.. అడుగడుగునా.. ఆయన వారికి అండగా నిలి చారు. వాస్తవానికి టీడీపీకి ఆది నుంచి కూడా బీసీలు అండగా ఉన్నారు. అన్న ఎన్టీఆర్ హయాం నుంచి కూడా బీసీలకు అవకాశం ఇస్తున్న పార్టీగా వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న పార్టీగా టీడీపీ గుర్తింపు పొం దింది.

దూరమైన వర్గం చేరువ కోసం
అయితే.. ఏం జరిగిందో ఏమో .. 2019 ఎన్నికలలో బీసీ సామాజిక వర్గాల్లో కొన్ని మాత్రం టీడీపీకి దూరమ య్యాయి. ఫలితంగానే పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిందనే ప్రచారం ఉంది. ఈనేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి.. బీసీలను టీడీపీకి మరింత చేరువ చేయాలని..అధిష్టానం నిర్ణయించింది. ఈ క్రమంలోనే అచ్చె న్నకు పార్టీ పగ్గాలు అప్పగించారు. అయితే.. ఆయన బీసీల పక్షాన గళం వినిపించడం ప్రారంభించిన తర్వాత.. ప్రభుత్వ పక్షం నుంచి అనేక నిర్బంధాలు ఎదురయ్యాయి.

వెన్ను చూపని నైజం!
గతంలో వాటిని తొవ్వి తీసిమరీ.. అచ్చెన్నపై కేసులు పెట్టారు. వేధింపులకు గురి చేశారు. ఇక, అధికార పార్టీ నాయకులతో ఆయనను తీవ్రస్థాయిలో దూషిస్తున్నారు. కనీసం ఒక్కసారిగా కూడా ప్రజల్లో గెలవని నాయకులు సైతం.. అధికారాన్ని చూసుకుని అచ్చెన్నకు సవాళ్లు విసురుతున్నారు. ఇక, ఎక్కడికి వెళ్లినా. . కూడా పోలీసుల డేగకళ్లు అచ్చెన్నను వెంటాడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ.. ఎక్కడా వెరవకుండా..అచ్చెన్న దూసుకుపోతున్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిండు మనసుతో నెరవేరుస్తున్నారు.

ఓ రేంజ్‌లో దూకుడు!
అదేసమయంలో ఎక్కడ అవకాశం ఉన్నా.. ఆయన పార్టీ తరఫున అండగా నిలుస్తున్నారు. పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు. బీసీలకు అండగా ఉంటామని.. వారంతా తమ వెంటే ఉన్నారని.. అచ్చెన్న చెబుతున్నా రు. ప్రతి ఒక్కరి సమస్యను వినేందుకు ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏ చిన్న కార్యక్రమం అయినా.. పాల్గొని.. వారిలో ఉత్సాహం నింపుతున్నారు. అదే సయమంలో సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ పరిణామాలతో అనూహ్యంగా అచ్చెన్న దూకుడు ఉందే… అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఇదే దూకుడు కొనసాగిస్తే…టీడీపీ అధికారంలోకి రావడం పక్కా!! అనే అంచనాలు కూడా వస్తున్నాయి.

చంద్రబాబుకు నమ్మిన బంటు!
ఇక, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులుగా ఉన్న అచ్చెన్నాయుడు.. పార్టీ జాతీయ అధ్యక్షులు.. నారా చంద్రబాబు నాయుడుకు నమ్మిన బంటు మాదిరిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు.. ప్రభుత్వం పార్టీ నేతలపై చేస్తున్న దాష్టీకాలను తిప్పి కొట్టడంలోనూ.. అచ్చెన్న తనదైన దూకుడు ప్రదర్శిస్తున్నారు. అదేసమయంలో పార్టీ అభ్యున్నతి కోసం.. అనేక ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గాల స్థాయిలో నాయకులతో నిత్యం మాట్లాడుతూ.. పార్టీని సమన్వయం చేసుకుంటూ.. అచ్చెన్న ముందుకు సాగుతున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహిత నాయకుడిగా.. అచ్చెన్న పేరు తెచ్చుకున్నారు.

ఇంతింతై..
టీడీపీలో ఎదగడం.. కీలకమైన పదువులు చేపట్టడం అన్నా.. చంద్రబాబు వంటి విజన్ ఉన్న నాయకుడి వద్ద మంచి మార్కులు వేయించుకోవడం అన్నా.. నాయకులు ఒక రికార్డుగా భావిస్తారు. ఎందుకంటే.. ఎంతో కష్టపడితే.. తప్ప.. చంద్రబాబు దగ్గర అంత ఈజీగా మార్కులు రావు. అలాంటి చంద్రబాబు దగ్గర మంచి మార్కులే. కాదు.. కీలకమైన పదవిని సైతం సంపాయించుకున్నారు అచ్చెన్నాయుడు. దీనికి కారణం.. ఆయన నిత్యం పార్టీ కోసం శ్రమించడం.. పార్టీ కోసం.. పలవరించడమే అంటున్నారు పరిశీలకులు.

ముందున్నది పెద్ద లక్ష్యం!
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా.. ఉన్న అచ్చెన్నాయుడు ముందు భారీ లక్ష్యమే ఉంది. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు.. ఇప్పటికే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే.. మున్ముందు.. వైసీపీని ఢీ కొట్టేందుకు.. మరింత సన్నద్ధతతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. బీసీ ఓటుబ్యాంకు ఇప్పటి కే టీడీపీకి చేరువైనా… మరిన్ని వర్గాలను కూడా .. టీడీపీకి చేరువ చేయాల్సి ఉంది. అదేవిధంగా పార్టీలో ఉన్నలోపాలను సరిదిద్దడంతోపాటు.. బలమైన నాయకుల ఎంపిక.. క్షేత్రస్థాయిలో వైసీపీ ఎత్తులకుపై ఎత్తులు.. ఇలా.. అనేక రూపాల్లో అచ్చెన్నకు పెద్ద లక్ష్యమే ఉందని అంటున్నారు పరిశీలకులు. చంద్రబాబు నమ్మకం.. అచ్చెన్న కృషి.. రెండు ఫలిస్తాయని చెబుతున్నారు.

Discussion about this post