రాజకీయాలకు కేంద్రంగా ఉండే బెజవాడ అదే విజయవాడలో టీడీపీలో ఎప్పుడు ఏదొక రచ్చ జరుగుతూనే ఉంటుంది. అక్కడ నాయకుల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయిలో నడుస్తూనే ఉంది. మొదట నుంచి సీనియర్ నేతలకు కొందరికి పడని పరిస్తితి ఉంది. ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలకు పడదు. వీరి మధ్య పలుమార్లు మాటల యుద్ధం కూడా జరిగింది.


అటు కేశినేని-దేవినేని ఉమాలకు అంతర్గత విభేదాలు ఉన్నాయి. అయితే దేవినేని అంతర్గతంగా రాజకీయం చేస్తారేమో గాని..కేశినేని మాత్రం బహిరంగంగానే దేవినేనిని టార్గెట్ చేసి పరోక్షంగా విమర్శలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా కూడా దేవినేని నియోజకవర్గం మైలవరం వెళ్ళి అక్కడ కేశినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా కాలం నుంచి మైలవరంలో దేవినేనికి వ్యతిరేకంగా టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు రాజకీయం చేస్తున్నారు. మైలవరం సీటు కోసం ఆయన ట్రై చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా సుబ్బారావు నిర్వహించిన కార్యక్రమానికి కేశినేని వచ్చారు..కానీ దేవినేని రాలేదు.


ఇదే క్రమంలో దేవినేనిపై పరోక్షంగా కేశినేని విమర్శలు చేశారు. ప్రభుత్వం మారాలంటే సీనియర్లంతా త్యాగాలకు సిద్ధంగా ఉండాలని, తానే సామంతరాజుననే ఇగో, పొగరుని పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేస్తేనే పార్టీ వస్తుందన్నారు. నాలుగు సార్లు గెలిచామనే ఇగో వదిలేయాలని, యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని.. జగన్ వంటి బలమైన ప్రత్యర్ధిని ఎదుర్కోవాలంటే తనతో సహా అందరూ త్యాగాలకు సిద్ధం కాకపోతే ఇబ్బందులు తప్పవన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు పిలిచినా తాను వెళ్తాను అన్నారు. కేశినేని నాని వ్యాఖ్యల్ని బట్టి దేవినేని ఉమాపై పరోక్షంగా సెటైర్లు వేశారనే చర్చ జరుగుతోంది. అయితే సీట్లు త్యాగం కేశినేని, దేవినేని త్యాగం చేస్తారా? అనే చర్చ కూడా నడుస్తోంది. చూడాలి మరి చివరికి ఎవరు సీటు త్యాగం చేస్తారో.


Leave feedback about this