ఇంకా ఎన్నికలు రాలేదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు అన్నా..కనీసం .. ఏడాదిన్నర సమయం పడు తుంది.అయితే.. ఇవన్నీ ఎలా ఉన్నా.. మాకు మాత్రం టికెట్ విషయాన్ని తేల్చాల్సిందేనని అంటున్నారు విజయవాడ టీడీపీ నాయకులు. ముఖ్యంగా వెస్ట్ సీటు విషయాన్ని కన్ఫర్మ్ చేయాలని ఒత్తిడి తెస్తున్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. పశ్చిమ నియోజకవర్గంలో ప్రస్తుతం ఇంచార్జ్ పీఠం ఖాళీగా ఉంది. అయితే.. దీనిని తనకు కేటాయించాలని .. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఒత్తిడి తెస్తున్నారు. ఇది తన సీటేనని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు.

అయితే.. అనారోగ్యంతో ఉన్న జలీల్‌కు టికెట్ ఇస్తే.. ఎలాంటి ఉపయోగం లేదని.. కొందరు నాయకులు ఇప్పటికే చంద్రబాబుకు సమాచారం చేరవేశారు. ఈ క్రమంలో బలమైన నాయకుడికి అవకాశం ఇవ్వాల నేది వీరి డిమాండ్. ఇప్పటికిప్పుడు టీడీపీలో వెస్ట్ లో పోటీ చేసే బలమైన నాయకుడు ఎవరూ కనిపించ డం లేదు. ఒకవేళ వచ్చే ఎన్నికల నాటికి ఎంపీ కేశినేని నాని.. కనుక పుంజుకుంటే.. ఆయన కుమార్తెకు ఈ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని గుసగుస వినిపిస్తోంది. అయితే.. వచ్చే ఎన్నిక లనాటికి .. కేశినేని పార్టీకి దూరం అవ్వాలని నిర్ణయించుకున్నట్టు ఒక చర్చ నడుస్తోంది.

దీంతో పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీకి సరైన నాయకుడు లేరనే వాదన బలంగా వినిపిస్తుండడం గమ నార్హం. ఈ పరిణామాలను గమనిస్తున్న విశ్లేషకులు.. మరో వాదనను తెరమీదికి తెస్తున్నారు. విజయవాడ తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాల్లో టీడీపీ దూకుడుగా ఉన్న నేపథ్యంలో ఈ రెండు స్థానాలను చంద్రబాబు తనకిందే పెట్టుకుని.. రేపు జనసేనతో పొత్తు పెట్టుకుంటే కనుక.. వెస్ట్ సీటును జనసేనకు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు.

అంటే.. పార్టీకి ఎలాగూ.. బలమైన నాయకుడు లేనందున.. ఉన్న దాన్ని వివాదం చేసుకోకుండా.. ఉభయ కుశలలోపరిగా.. ఉంటుందనే వ్యూహంతో జజనసేనకు కేటాయించే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Discussion about this post