రాష్ట్ర విభజన తర్వాత టీడీపీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో విజయవాడ కూడా ఒకటి..2014 ఎన్నికల నుంచి విజయవాడలో టీడీపీ సత్తా చాటుతూ వస్తుంది. 2014లో విజయవాడ నగరంలో ఉన్న విజయవాడ తూర్పు, సెంట్రల్ అసెంబ్లీ సీట్లతో పాటు, విజయవాడ పార్లమెంట్ సీటు గెలుచుకుంది..ఒక్క వెస్ట్ సీటుని స్వల్ప మెజారిటీతో కోల్పోయింది. అదే సమయంలో విజయవాడ దగ్గరలో ఉన్న మైలవరం, పెనమలూరు, గన్నవరం సీట్లని సైతం టీడీపీ గెలిచింది.

ఇక 2019 ఎన్నికల్లో విజయవాడ తూర్పు, విజయవాడ ఎంపీ సీటుని గెలుచుకుంది…సెంట్రల్, వెస్ట్ సీట్లని స్వల్ప మెజారిటీ తేడాలతో కోల్పోయింది. అలాగే గన్నవరం గెలుచుకోగా, పెనమలూరు, మైలవరం సీట్లలో ఓడిపోయింది. అయితే మూడేళ్లలోనే విజయవాడలో సైకిల్ స్పీడ్ పెరిగింది..వైసీపీపై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో పెరగడం, టీడీపీ నేతలు దూకుడుగా పనిచేయడంతో ఎక్కడకక్కడ టీడీపీ పుంజుకుంది. ఎలాగో తూర్పులో టీడీపీ బలంగా ఉంది. అటు సెంట్రల్ సీటులో టీడీపీ పికప్ అయింది. మైలవరం, పెనమలూరు సీట్లలో టీడీపీ లీడ్ లోకి వచ్చింది.

అటు గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ వైసీపీ వైపుకు వెళ్ళాక..టీడీపీ ఇంచార్జ్ గా బచ్చుల అర్జునుడుని పెట్టారు…అయితే ఆయన అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. ఇక్కడ కమ్మ నేతకు సీటు ఇస్తే ప్లస్ అవుతుంది. ఇక వెస్ట్ సీటులో వైసీపీపై నెగిటివ్ పెరుగుతుంది..కానీ వెస్ట్ లో టీడీపీకి బలమైన నాయకుడు లేరు. వెస్ట్ బాధ్యతలు ఎంపీ కేశినేని నానికి అప్పగించారు. అయితే ఆయనకు టీడీపీ శ్రేణులు పెద్దగా సహకరిస్తున్నట్లు కనిపించడం లేదు.



పైగా కేశినేని, బుద్దా వెంకన్న వర్గాలకు పడటం లేదు. దీని వల్ల బెజవాడలో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ ఆధిపత్య పోరు వల్లే విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. కాబట్టి ఈ ఆధిపత్య పోరు తగ్గితే టీడీపీకి ప్లస్ అవుతుంది..లేదంటే బెజవాడలో టీడీపీకి షాకులు తగిలే ఛాన్స్ ఉంది.

Discussion about this post