ఉమ్మడి కర్నూలు జిల్లాలో పేరున్న భూమా ఫ్యామిలీకి రాజకీయంగా పెద్దగా ఏది కలిసొస్తున్నట్లు కనిపించడం లేదు. గత ఎన్నికల్లోనే దారుణంగా ఓటమి పాలైన భూమా ఫ్యామిలీ..ఇప్పటికీ వారి స్థానాల్లో బలపడలేదని తెలుస్తోంది. ఆళ్లగడ్డ, నంద్యాల సీట్లు అంటే భూమా ఫ్యామిలీ కంచుకోటలు..వారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
కానీ గత ఎన్నికల్లో వారు టిడిపి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ, నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. వారే ప్రస్తుతానికి ఇంచార్జ్ లుగా ఉన్నారు. అయితే వారిలో వారికే సఖ్యత లేకపోవడం, భూమా ఫ్యామిలీలో విభేదాలు ఉండటం..అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకోలేని స్థితిలో భూమా ఫ్యామిలీ ఉంది. ఆళ్లగడ్డలో అఖిల బలం పెరగడం లేదు. ఆమె చాలాకాలం వ్యక్తిగత ఇబ్బందులు వల్ల యాక్టివ్ గా లేరు. ఇప్పుడు కాస్త యాక్టివ్ గా ఉన్నారు. అయినా సరే ఆళ్లగడ్డలో ఇంకా పార్టీ బలపడాలి.

అదే సమయంలో అఖిల నంద్యాల నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. ఆ సీటు తన సొంత తమ్ముడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డికి ఇప్పించుకోవాలని చూస్తున్నారు. అదే సమయంలో ఆళ్లగడ్డలో అసలు అఖిలని సైడ్ చేసి..ఆ సీటుని భూమా కిశోర్ రెడ్డికి ఇవ్వాలని టిడిపి చూస్తుంది. ఇలా సీట్ల విషయంలో కన్ఫ్యూజన్ ఉంది.
దీంతో తాజా సర్వేల్లో ఆళ్లగడ్డ, నంద్యాలల్లో టిడిపి గెలిచే అవకాశాలు లేవని తేలింది. అయితే అభ్యర్ధులని మార్చడమో..లేక ఉన్నవారే ఇంకా దూకుడుగా పనిచేసి బలపడితే రెండు చోట్ల భూమా ఫ్యామిలీకి గెలవడానికి అవకాశాలు ఉంటాయి. లేదంటే అంతే సంగతులు.
