రాష్ట్రంలో టిడిపి బలపడుతున్న నేపథ్యంలో..ఆ పార్టీలో సీటు కోసం పోటీ పడే నేతల సంఖ్య పెరుగుతుంది. ఈ సారి వైసీపీకి చెక్ పెట్టి టిడిపి అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో..ఒకే సీటుకు ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. ఇదే క్రమంలో సీటు కోసం భూమా ఫ్యామిలీలో పోటీ నెలకొంది. భూమా ఫ్యామిలీలో అఖిలప్రియతో పాటు తన సోదరుడు విఖ్యాత్ రెడ్డి సీటు ఆశిస్తున్నారు. అటు ఇటీవల మంచు మనోజ్ తో కలిసి చంద్రబాబుని కలిసిన భూమా మౌనిక సైతం సీటు ఆశిస్తున్నట్లు తెలిసింది.
అదే భూమా ఫ్యామిలీలో బ్రహ్మానందరెడ్డి నంద్యాల ఇంచార్జ్ గా ఉన్నారు. అటు ఆళ్లగడ్డలో అఖిలప్రియ ఉండగానే..బిజేపి ఇంచార్జ్ గా భూమా కిషోర్ రెడ్డి ఉన్నారు. అయితే అఖిల తనకు ఆళ్లగడ్డ సీటు..తన సొంత సోదరుడు విఖ్యాత్కు నంద్యాల సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు. తాజాగా విఖ్యాత్ కూడా నంద్యాలలోనే రాజకీయం మొదలుపెడతానని అన్నారు. దీంతో బ్రహ్మానందరెడ్డికి సీటు విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. అటు మౌనిక సైతం రేసులోకి రావడంతో సీట్ల విషయంలో క్లారిటీ రావడం లేదు.
అసలు భూమా ఫ్యామిలీలో ఎవరికి సీటు దక్కుతుందో అర్ధం కాకుండా ఉంది. ప్రస్తుతం టిడిపి వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..ఆళ్లగడ్డలో అఖిల, నంద్యాలలో బ్రహ్మానందరెడ్డి పోటీ చేస్తారని తెలుస్తోంది. చివరి నిమిషంలో ఏమైనా మార్పు జరిగితే తప్ప..ఈ సీట్లలో మార్పు ఉండదని అంటున్నారు. చంద్రబాబు కూడా అదే డిసైడ్ అయినట్లు తెలిసింది. చూడాలి మరి లాస్ట్ మినిట్ లో భూమా ఫ్యామిలీ సీట్ల విషయంలో ఏదైనా మార్పు జరుగుతుందేమో.
ReplyReply allForward |