ఉమ్మడి కర్నూలు జిల్లాలో భూమా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాల కాలం నుంచి భూమా ఫ్యామిలీ కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఉంది..భూమా నాగిరెడ్డి, శోభ నాగిరెడ్డి..హవా రెండు దశాబ్దాల పాటు నడిచింది. కానీ వారిద్దరు చనిపోవడం, వారసుల ఎంట్రీతో భూమా ఫ్యామిలీ గ్రాఫ్ డౌన్ అవుతూ వస్తున్నట్లు కనిపిస్తుంది. గత ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ, నంద్యాల నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.


ఓడిపోయిన దగ్గర నుంచి అక్కడే పనిచేస్తున్నారు..కానీ అక్కడ పార్టీ బలం పెంచలేకపోతున్నారు..రెండు చోట్ల వైసీపీ డామినేషన్ నడుస్తోంది. పైగా భూమా ఫ్యామిలీలో విభేదాలు నడుస్తున్నాయి. అఖిల ఆళ్లగడ్డతో పాటు నంద్యాలపై ఫోకస్ పెట్టారు. ఈ సీటుని బ్రహ్మానందరెడ్డికి కాకుండా తన సొంత తమ్ముడు విఖ్యాత్ రెడ్డికి నంద్యాల సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారు.

ఇదే సమయంలో ఆళ్లగడ్డ సీటు విషయంలో ట్విస్ట్ వచ్చేలా ఉంది. ఆళ్లగడ్డలో అఖిలకు అడ్వాంటేజ్ కనిపించడం లేదు. దీంతో ఆ సీటుని అఖిలకు ఇవ్వడం కష్టమని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆళ్లగడ్డ సీటుని భూమా కిషోర్ రెడ్డికి ఇవ్వాలని టిడిపి చూస్తుందట. కిషోర్..బిజేపిలో ఉన్నారు. ఆయనని టిడిపిలోకి తీసుకురావాలని చూస్తున్నారట.

ఇలా భూమా ఫ్యామిలీలో ట్విస్ట్ లో వస్తున్నాయి. మరి భూమా ఫ్యామిలీ సీట్ల విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
