ఏపీలో ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు పుంజుకున్నట్లే కనిపిస్తున్నారు..గత ఎన్నికల్లో ఓటమి తర్వాత..చాలామంది నేతలు కాస్త రాజకీయంగా బయటకు రావడానికి ఇబ్బంది పడ్డారు..పైగా వైసీపీ ఎడాపెడా కేసులు పెట్టడంతో కొందరు నేతలు లేనిపోని తలనొప్పి ఎందుకని సైలెంట్ అయ్యారు….దీని వల్ల నియోజకవర్గాల్లో టీడీపీ వెనుకబడింది…అయితే టీడీపీ అధినేత చంద్రబాబు…ఎప్పటికప్పుడు టీడీపీ నేతలకు అండగా ఉండి ముందుకు నడిపించారు..ఎక్కడకక్కడ వైసీపీపై పోరాటం చేస్తూ వచ్చారు. అలాగే వైసీపీ పాలనపై ప్రజల్లో కూడా అసంతృప్తి మొదలు కావడంతో టీడీపీకి ప్లస్ అయింది.

ఎప్పుడైతే వైసీపీపై వ్యతిరేకత మొదలైందో అప్పటినుంచి టీడీపీ నేతలు దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు…వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం షురూ చేశారు..దీంతో చాలావరకు టీడీపీ నేతలు పికప్ అయ్యారు..అయితే ఇంకా కొంతమంది నేతలు పుంజుకోవాల్సిన అవసరం ఉంది…ముఖ్యంగా వైసీపీకి బాగా అనుకూలంగా ఉన్న స్థానాల్లో టీడీపీ నాయకులు ఎంత కష్టపడిన ప్రయోజనం ఉండటం లేదు.

అలాంటి స్థానాల్లో పార్టీ ఇంకా బలపడటానికి సరైన వ్యూహాలు పన్ని ముందుకెళ్లాలి..నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సైతం అలాగే ముందుకెళితే బెటర్ అని చెప్పొచ్చు..గత ఎన్నికల్లో ఓడిపోయిక బ్రహ్మానందరెడ్డి అనుకున్న విధంగా యాక్టివ్‌గా ఏమి పనిచేయలేదు…పైగా స్థానిక ఎన్నికల్లో నంద్యాలలో టీడీపీ దారుణంగా ఓడిపోయింది. ఇక ఆ తర్వాత పార్టీ పరిస్తితి మరీ దిగజారుతున్న సమయంలో భూమా కాస్త దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. స్థానికంగా ఉండే సమస్యలపై పోరాటం చేస్తున్నారు.

అయితే భూమా కాస్త లేటుగా పోరాటం మొదలుపెట్టడంతో నంద్యాలలో టీడీపీ ఇంకా పికప్ అవ్వలేదనే చెప్పాలి…ఇప్పటికీ అక్కడ వైసీపీ హవానే కనిపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి డామినేషన్ కాస్త ఎక్కువగానే ఉంది..ఈ డామినేషన్ తగ్గించాలంటే భూమా నిత్యం ప్రజల్లోనే తిరగాలి…వైసీపీ అవలంభించే ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగట్టాలి…గతంలో టీడీపీ చేసిన అభివృద్ధిని హైలైట్ చేయాలి…అప్పుడే కొద్దో గొప్పో నంద్యాలలో భూమాకు పట్టు దొరుకుతుంది..త్వరగానే భూమా సెట్ అవుతారు కూడా.

Discussion about this post