ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో బెజవాడ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఏపీ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న బెజవాడలో ఈ సారి సత్తా చాటాలని అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టిడిపి గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. విజయవాడ పరిధిలో మెజారిటీ సీట్లు సాధించాలని చూస్తున్నాయి. గత ఎన్నికల్లో అక్కడ వైసీపీ హవా ఎక్కువ నడిచింది. కానీ ఈ సారి వైసీపీకి ఆ ఛాన్స్ ఉండేలా లేదు.

ఇప్పటికే టిడిపి-జనసేన పొత్తు దిశగా వెళుతున్నాయి..పొత్తులో వెళితే..వైసీపీకి చెక్ పడే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కూడా ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలోనే విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌పై వ్యతిరేకత ఎక్కువగానే కనిపిస్తుంది. మొన్నటివరకు మంత్రిగా చేసి పెద్ద ఎత్తున అవినీతి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దానికి తోడు వెస్ట్ లో ఎక్కువగా ఉన్న ముస్లింలని వెల్లంపల్లి పెద్దగా పట్టించుకోవడం లేదని, వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ముస్లిం ఓటు బ్యాంకు వెల్లంపల్లికి యాంటీ అవుతుంది.

అదే సమయంలో సొంత పార్టీ నేతలతో వెల్లంపల్లికి పడటం లేదు. ఇటు మల్లాది విష్ణు..అటు సామినేని ఉదయభానుతో కయ్యం ఉంది. ఈ క్రమంలో నెక్స్ట్ వెల్లంపల్లికి సీటు ఇస్తే గెలవడం కష్టమనే పరిస్తితి. ఇక ఈయనకు జగన్ సీటు ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ కొత్త అభ్యర్ధిని రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అది కూడా ముస్లిం వర్గానికి చెందిన నేతని పోటీకి దింపుతారని సమాచారం. ఇక వైసీపీ నుంచి ఎవరు బరిలో ఉన్న టిడిపి-జనసేన పొత్తు ఉంటే ఇక్కడ వైసీపీ గెలవడం కష్టమే అని చెప్పవచ్చు.