రఘురామకృష్ణంరాజు….ఏపీ రాజకీయాల్లో బాగా హాట్ టాపిక్ అవుతున్న నాయకుడు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామ, ఇప్పుడు అదే పార్టీకి పెద్ద ప్రతిపక్షం మాదిరిగా తయారయ్యాడు. మొదట నుంచి తమ ప్రభుత్వం చేసే తప్పులని రఘురామ ఎత్తిచూపిస్తూనే ఉన్నారు. అందుకే ఆయనకు చెక్ పెట్టాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. ఇప్పటికే రఘురామ ఎంపీ పదవిపై వేటు వేయాలని పలుమార్లు లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే రాజద్రోహం కేసు పెట్టి జగన్ ప్రభుత్వం చేసిన రచ్చ గురించి తెలిసిందే.అయినా సరే రఘురామ వెనక్కి తగ్గట్లేదు. వరుసపెట్టి లేఖలు పేరిట విమర్శల బాణాలు సంధిస్తున్నారు. ఆ బాణాలు వైసీపీ ప్రభుత్వానికి గట్టిగానే గుచ్చుకుంటున్నాయని చెప్పొచ్చు.
ఎందుకంటే రఘురామ లేఖలని చూస్తే జగన్ వరుస పెట్టి మాట తప్పారనే చెప్పొచ్చు.ఉదాహరణకు అధికారంలోకి వచ్చిన వారం లోపే సిపిఎస్ రద్దు చేస్తామని జగన్ చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతున్న కూడా దాని ఊసు తీయడం లేదు.పెన్షన్ ఏడాదికి రూ.250 పెంచుకుంటూ పోతానని అన్నారు…కానీ పన్నులు పెంచుకుంటూ పోతున్నారు. రైతుభరోసా విషయంలో మాట తప్పారు. వాలంటీర్లవి ఉద్యోగాలు కాదని చెప్పి, వాటినే ఇప్పుడు ఉద్యోగాలు కింద లెక్క వేస్తున్నారు. అలాగే జాబ్ క్యాలెండర్ పేరిట 10 వేల ఉద్యోగాలు ప్రకటించి, నిరుద్యోగులని పెద్ద ఎత్తున మోసం చేశారు. హోదా అంశం గాలిలో కలిసిపోయింది. అధికారంలోకి వచ్చాక కూడా జగన్ మాట తప్పుతున్నారని మండలి రద్దు అంశంలో అర్ధమవుతుంది. మొదట మండలి రద్దు చేసి కేంద్రానికి పంపించారు.ఇప్పుడు మండలిలో వైసీపీకి మెజారిటీ పెరగడంతో, దాని ఊసు తీయడం లేదు.
ఇలా ప్రతి అంశంలోనూ జగన్ మాట తప్పారని గుర్తు చేస్తే రఘురామ లేఖలు రాస్తూ జగన్ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా ఆస్తిపన్ను, చెత్త పన్ను, శ్లాబ్‌లతో విద్యుత్ బిల్లులు పెరిగి వినయోగదారులపై భారం పడిన విషయంపై రఘురామ లేఖ రాశారు. ఇక రఘురామ రాసే లేఖల్లో వాస్తవాలని ప్రజలు పూర్తిగా గ్రహిస్తే జగన్ ప్రభుత్వానికి చుక్కలు కనబడుతాయని చెప్పొచ్చు. మొత్తానికైతే రఘురాముని బాణాలు జగన్ ప్రభుత్వానికి బాగానే గుచ్చుకుంటున్నాయి.
Discussion about this post