విశాఖపట్నంలో కాపు సామాజికవర్గం ప్రభావం ఎక్కువగా నియోజకవర్గాల్లో భీమిలి ఒకటి. గత కొన్నేళ్ళ నుంచి ఇక్కడ కాపు వర్గానికి చెందిన నేతలే విజయం సాధిస్తున్నారు. అలాగే కాపు ఓటర్లే ఇక్కడ గెలుపోటములని ప్రభావితం చేస్తున్నారు. అయితే ఇక్కడ కాపులు ముందు నుంచి టీడీపీకి మద్ధతుగా ఉన్నారు. అందుకే ఇక్కడ ఎక్కువసార్లు టీడీపీనే గెలిచింది. భీమిలిలో టీడీపీ ఆరుసార్లు గెలిచింది.2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున గంటా శ్రీనివాసరావు పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో గంటా విశాఖ నార్త్‌కు వెళ్ళడంతో భీమిలిలో టీడీపీ తరుపున సబ్బం హరి పోటీ చేసి అవంతి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలయ్యారు.
అయితే సబ్బం హరి ఈ మధ్యనే కరోనాతో మృతి చెందారు. దీంతో భీమిలిలో టీడీపీకి సరైన నాయకత్వం లేకుండా పోయింది. కాకపోతే ఇక్కడ ముందు నుంచి మాజీ ఎంపీపీ కోరాడ రాజాబాబు టీడీపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు.కాపు వర్గానికి చెందిన రాజబాబుకు నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవల విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో భీమిలిలో ఉన్న డివిజన్లలో టీడీపీ సత్తా చాటింది. ఇక్కడ 9 డివిజన్లు ఉంటే టీడీపీ 5 గెలుచుకుంటే, వైసీపీకి నాలుగు దక్కాయి. మంత్రి అవంతి శ్రీనివాస్ ఉన్నా సరే ఇక్కడ టీడీపీ గెలుపుని ఆపలేకపోయారు. టీడీపీ గెలుపులో రాజబాబు కీలక పాత్ర పోషించారు. ఇలా టీడీపీ గెలుపు కోసం కష్టపడిన రాజబాబుకే తాజాగా భీమిలి ఇన్‌చార్జ్ ఇచ్చారు. దీంతో భీమిలిలో మరింత దూకుడుగా పనిచేయడానికి రాజబాబు సిద్ధమయ్యారు.వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టడానికి రాజబాబు రెడీ అవుతున్నారు.
అయితే ఇక్కడ జనసేన వల్ల టీడీపీకి నష్టం జరిగే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ జనసేనకు 22 వేల ఓట్ల వరకు పడ్డాయి. కానీ వైసీపీకి వచ్చిన మెజారిటీ 9 వేలు. అంటే టీడీపీ-జనసేనలు కలిస్తే ఫలితం ఎలా వచ్చేదో చెప్పాల్సిన పనిలేదు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కూడా జనసేన విడిగా పోటీ చేస్తే టీడీపీకే డ్యామేజ్ జరిగేలా ఉంది. మరి చూడాలి రాజబాబు భీమిలిలో సైకిల్‌ని ఎలా సెట్ చేస్తారో ?
ReplyForward |
Discussion about this post