నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు స్థానాల్లో పాదయాత్ర ముగించుకుని లోకేష్ ఇప్పుడు నందికొట్కూరులో ఎంట్రీ ఇచ్చారు. అయితే లోకేష్ పాదయాత్ర చేసిన స్థానాల్లో టిడిపికి కాస్త మైలేజ్ వస్తుంది. కొన్ని స్థానాల్లో బాగా పికప్ అవుతుంటే..కొన్ని స్థానాల్లో కొంతమేర టిడిపికి ప్లస్ అవుతుంది. మరి ఇదే సమయంలో లోకేష్ నందికొట్కూరులో ఎంట్రీ ఇచ్చారు..కాబట్టి ఇక్కడేమన్న పార్టీకి ప్లస్ అవుతుందా?అంటే అయ్యే అవకాశాలు లేకపోలేదు..కానీ అక్కడ వైసీపీ ఆధిక్యం తగ్గించడం సులువు కాదనే పరిస్తితి.

మామూలుగా నందికొట్కూరు అంటే వైసీపీకి కంచుకోట..గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలుస్తూ వస్తుంది..భారీ మెజారిటీలతో సత్తా చాటుతుంది. అయితే ఇది ఎస్సీ రిజర్వడ్ కాకముందు ఇక్కడ టిడిపికి ప్లస్ ఉంది. 1985, 1994, 1999 ఎన్నికల్లో టిడిపి గెలిచింది. రెండు ఎన్నికల్లో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గెలిచారు. తర్వాత నుంచి అక్కడ టిడిపి గెలుపుకు దూరమైంది. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుస్గ ఓడిపోయింది. పైగా బైరెడ్డి కుటుంబం కూడా టిడిపికి దూరమైంది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు బిజేపిలో ఉండగా, ఇటు బైరెడ్డి సోదరుడు కుమారుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వైసీపీలో ఉన్నారు. అయితే బైరెడ్డి ఫ్యామిలీ హవా సిద్ధార్థ్‌కు ప్లస్ అయింది. అక్కడ సిద్ధార్థ్ కు బలం కనిపిస్తుంది. ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తే వారు గెలుస్తారనే పరిస్తితి.
అలాంటి కంచుకోటలో ఇప్పుడు లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. ప్రజా మద్ధతు బాగానే వస్తుంది. అయితే ఇక్కడ టిడిపి బలమైన నాయకుడుని పెట్టి..ఎన్నికల వరకు కష్టపడితే..కాస్త పైచేయి సాధించే ఛాన్స్ ఉంది. అలా కాకుండా పాదయాత్ర అయ్యాక అక్కడ నాయకులు లైట్ తీసుకుంటే నందికొట్కూరుని టిడిపి వదిలేసుకోవచ్చు.
