ఉమ్మడి విశాఖలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా ఉన్న స్థానాల్లో భీమిలి కూడా ఒకటి. ఇక్కడ టిడిపి ఆరుసార్లు గెలిచింది. అయితే ఈ సారి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా టిడిపి ముందుకెళుతుంది. అయితే ఇక్కడ జనసేనతోనే ట్విస్ట్‌లు ఉన్నాయి. ఇక్కడ జనసేనకు కూడా బలం ఉంది. వాస్తవానికి గత ఎన్నికల్లో ఇక్కడ టిడిపి ఓడిపోవడానికి కారణం జనసేన ఓట్లు చీల్చడమే. వైసీపీ నుంచి పోటీ చేసిన అవంతి శ్రీనివాస్ 9 వేల ఓట్లతో టిడిపిపై గెలవగా, జనసేనకు 24 వేల ఓట్లు పడ్డాయి. అంటే టిడిపి-జనసేన కలిస్తే వైసీపీ గెలిచేది కాదు.
అయితే ఈ సారి ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు ఉండేలా ఉంది. పొత్తు ఉంటే సీటు ఎవరికి దక్కుతుందో క్లారిటీ లేదు. ఇక ఇటు టిడిపికి సీటు దక్కితే సీటు ఎవరికి వస్తుందో కూడా తెలియడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ టిడిపి ఇంచార్జ్ గా కోరాడ రాజాబాబు ఉన్నారు. మరి ఆయనకు సీటు ఇస్తారా? అంటే డౌటే అని చెప్పవచ్చు. ఇటు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరొకసారి భీమిలిలో పోటీ చేయవచ్చని ప్రచారం జరుగుతుంది. 2014లో ఆయన భీమిలి నుంచే పోటీ చేసి గెలిచారు.

2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ కు వెళ్ళి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు అక్కడ గంటాకు పాజిటివ్ లేదు. అలా అని రాజాబాబు భీమిలి సీటుపై గట్టి పట్టు పట్టారు. ఒకవేళ పొత్తు ఉంటే జనసేన సీటు అడిగే ఛాన్స్ ఉంది. దీంతో సీటుపై క్లారిటీ లేదు.
వైసీపీ నుంచి మళ్ళీ అవంతి శ్రీనివాస్ పోటీ చేసే ఛాన్స్ ఉంది..కానీ ఆయనకు గెలిచే ఛాన్స్ కనబడటం లేదు. బాగా వ్యతిరేకత ఉంది. ఇక టిడిపి-జనసేన కలిస్తే అవంతి గెలవడం జరిగే పని కాదు.
