ఏపీలో పొత్తుల అంశంపై రాజకీయాలు ఊహించని విధంగా నడుస్తున్నాయి. ఎలాగో టిడిపి, జనసేన కలిసి పొత్తు దిశగా వెళుతున్న సంగతి తెలిసిందే. పొత్తు పెట్టుకుని వైసీపీని చిత్తు చేయాలనేది టిడిపి, జనసేన వ్యూహం. అదే సమయంలో బిజేపిని కూడా కలుపుకుని వెళ్లాలని టిడిపి, జనసేన చూస్తున్నాయి. రాష్ట్రంలో బలం లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల..బిజేపి అధికార బలం తమకు కలిసొస్తుందని భావిస్తున్నాయి.

కానీ రాష్ట్రంలో బిజేపి నేతలు ఏమో టిడిపితో పొత్తు పెట్టుకోమని అంటున్నారు. అదే సమయంలో రాష్ట్రానికి మేలు చేయని బిజేపి పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఒక్క సీటు కూడా గెలుచుకోలేని బిజేపితో పొత్తు వద్దని, దాని వల్ల టిడిపికే నష్టమని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. ఇలాంటి సమయంలోనే ఇటీవల బిజేపి పెద్దలతో చంద్రబాబు భేటీ కవరం రాజకీయం మరో మలుపు తిరిగింది. ఆ భేటీ ఎందుకనేది ఎవరికి క్లారిటీ లేదు. పైకి మాత్రం తెలంగాణలో బిజేపికి టిడిపి మద్ధతు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది. ఇక రాష్ట్ర ప్రయోజనాల కోసమే బిజేపి పెద్దలతో తాను భేటీ అయ్యానని బాబు చెబుతున్నారు.

పొత్తుల వ్యవహారం ఎన్నికల సమయంలో చూసుకుందామని అంటున్నారు. అయితే బిజేపి ఏమో డబుల్ గేమ్ ఆడుతుంది..ఓ వైపు జగన్‌కు ఫుల్ సపోర్ట్ ఇస్తూ..బాబుతో భేటీ అవ్వడం ఏంటి అనేది క్లారిటీ లేదు. కానీ తెలుగు తమ్ముళ్ళు మాత్రం తెలంగాణలో ఎలా ఉన్నా ఏపీలో మాత్రం బిజేపితో పొత్తు వద్దంటే వద్దు అంటున్నారు.
అసలు కొందరైతే బిజేపితో పొత్తు ఉంటే తమ ఓటు నోటాకి వేస్తామని మాట్లాడుతున్నారు. అయితే రాజకీయాల ఎలా ఉంటాయనేది బాబుకు తెలియనిది కాదు..ఆయనకు ఏ సమయంలో ఎలా చేయాలో బాగా తెలుసు. కాబట్టి పొత్తులపై అనవసరంగా ఎవరు కంగారు పడవద్దని అన్నీ బాబు చూసుకుంటారని కొందరు కార్యకర్తలు మాట్లాడుతున్నారు. చూడాలి మరి చివరికి పొత్తులు ఎలా ఫిక్స్ అవుతాయో.