ఏపీ బీజేపీలో కొందరు నాయకులు జగన్‌కు అనుకూలంగా ఉంటారనే విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. వారు జగన్‌పై ఎలాంటి విమర్శలు చేయరు గానీ…చంద్రబాబుపై మాత్రం విరుచుకుపడతారు. అలా బాబుపై విరుచుకుపడే నేతలు ఎవరో అందరికీ తెలిసిందే. పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు, యువ నేత విష్ణువర్ధన్ రెడ్డిలు చంద్రబాబుపై ఏదో రకంగా విమర్శలు చేయాలనే చూస్తారు.

వీరు పనిగట్టుకుని మరీ బాబుపై విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ డైరక్ట్‌గా జగన్‌ని ఒక్క మాట అనరు. అందుకే వీరిని వైసీపీ కోవర్టులు అని టీడీపీ శ్రేణులు విమర్శిస్తుంటాయి. ఇలా చంద్రబాబుపై విరుచుకుపడే ఈ ఇద్దరు నేతలు..టీడీపీతో పొత్తు పెట్టుకునే విషయంలో కూడా స్పందిస్తుంటారు. పైగా ఇటీవల టీడీపీ-జనసేనల మధ్య పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతుంది.

ఇటీవల దీనిపై చంద్రబాబు పరోక్షంగా స్పందించారు…లవ్ అనేది రెండువైపులా ఉండాలన్నట్లు మాట్లాడారు. దీనిపై సోము స్పందించి బాబుపై విమర్శలు చేశారు. అలాగే తాజాగా పవన్ కల్యాణ్ పొత్తుపై స్పందిస్తూ..బీజేపీతో పొత్తులో ఉన్నామని, ఇంకా పొత్తుల గురించి తగిన సమయంలో నిర్ణయించుకుందామని, ఇప్పుడు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని జనసేన నేతలకు సూచించారు.

ఇక్కడ పవన్ మాటలు బట్టి చూస్తే…ఆయన టీడీపీతో పొత్తు వద్దు అని చెప్పలేదు. సమయం వచ్చినప్పుడు చూద్దామని అన్నారు. అంటే పొత్తుకు పవన్ సిద్ధంగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. కానీ ఈలోపే సోము, విష్ణులు తొందరపడి మాట్లాడేస్తున్నారు. అసలు పవన్, టీడీపీతో పొత్తు వద్దే వద్దు అన్నట్లు చెబుతున్నారు.

అలాగే కొందరు పొత్తు విషయంలో మైండ్ గేమ్ ఆడుతున్నారని పవన్ అన్నారు. ఇక దీనిపై కూడా సోము తనకు నచ్చినట్లు ఊహించుకుంటూ..జనసేన, బీజేపీలు కలిసి మైండ్ గేమ్ ఆడేవారికి చెక్ పెడతాయని మాట్లాడుతున్నారు. బీజేపీ-జనసేనలు కలిసి అధికారంలోకి రాబోతున్నాయంటూ మాట్లాడుతున్నారు. మొత్తానికి పవన్ మాటల్లోని లాజిక్ సోము-విష్ణులకు అర్ధమైనట్లు లేవు. అసలు పవన్, టీడీపీతో పొత్తు వద్దు అనలేదనే విషయం అర్ధం కాలేదు.

Discussion about this post