బద్వేలు ఉపఎన్నికలో 21 వేల ఓట్లు వచ్చేసరికి…బీజేపీ నేతలు ఎక్కడా ఆగడం లేదు. ఇంతకాలం నోటా ఓట్లని కూడా దాటని బీజేపీ…ఏకంగా 21 వేల ఓట్లు తెచ్చుకునే సరికి బీజేపీ నేతలు జబ్బలు చరిచేసుకుంటున్నారు. ముఖ్యంగా బీజేపీ ఏపీ సహ ఇన్‌చార్జి సునీల్ దేవ్‌ధర్ హడావిడి మామూలుగా లేదు. బద్వేలులో బీజేపీకి ఓటమి ఎదురైనా, ఫలితాలు సంతోషాన్ని ఇచ్చాయని, గతంలో 700 ఓట్లు వచ్చిన బద్వేలులో ఇప్పుడు 21 వేల ఓట్లు వచ్చాయని, తమకు ప్రజల మద్ధతు పెరిగిందని అంటున్నారు.

అలాగే ఇన్ని ఓట్లు టీడీపీ వల్ల రాలేదని, తమని చూసి ప్రజలు ఓట్లు వేశారని, కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు సన్నిహితంగా ఉన్నారని, టీడీపీ సహకరించడం వల్లే బద్వేలులో కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు పడ్డాయని చెబుతున్నారు. ఇక టీడీపీ కుటుంబ పార్టీ అని, అవినీతి పార్టీ అని, తెలంగాణలో మూసేశారని, ఏపీలో కూడా త్వరలోనే మూసేస్తారని, అలాంటి పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని సునీల్ తేల్చి చెప్పారు.

అయితే సునీల్‌కు ఓవర్ యాక్షన్ ఎక్కువైందని, బద్వేలులో బీజేపీని చూసి ఓట్లు వేశారంటే..అంతా నవ్వుతారని, కనీసం నోటాని కూడా దాటలేని బీజేపీకి 21 వేల ఓట్లు వచ్చాయో అందరికీ తెలుసని టీడీపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి. అసలు బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ఎవరు చెప్పారని, అనవసరంగా సునీల్ ఎక్కువ ఊహించుకుంటున్నారని, అసలు నోటాతో పోటీ పడలేని బీజేపీతో టీడీపీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు.

ఆఖరికి జనసేన సపోర్ట్ తీసుకున్న సరే బీజేపీకి నోటా కంటే ఎక్కువ ఓట్లు రావని, అలాంటి పార్టీకి ఇంచార్జ్‌గా టీడీపీ గురించి మాట్లాడటం కాస్త కామెడీగా ఉందని అంటున్నారు. కాబట్టి సునీల్ ఓవర్ యాక్షన్ ఆపేసి…ముందు నోటాపై గెలిచే మార్గాలని వెతుక్కుంటే బెటర్ అని తమ్ముళ్ళు సెటైర్లు వేస్తున్నారు.

Discussion about this post