ఇంకా పొత్తులపై క్లారిటీ ఇచ్చే సమయం దగ్గరపడింది. ఇప్పటివరకు పొత్తులపై సరైన క్లారిటీ లేదు..ఎవరెవరు కలుస్తారు అనేది తెలియలేదు. మొదట నుంచి మాత్రం టిడిపి-బిజేపి-జనసేన పొత్తు ఉండవచ్చు అని ప్రచారం జరుగుతుంది. ఇలా మూడు పార్టీల మధ్య పొత్తు ఉండవచ్చు అని చర్చలు నడుస్తున్నాయి. కానీ ప్రస్తుతం బిజేపి-జనసేన కలిసి ఉన్నాయి. అయితే బిజేపి మాత్రం..టిడిపితో కలవమని చెబుతుంది.
ఇటు టిడిపికి సైతం బిజేపితో కలవడం ఇష్టం లేదు. కాకపోతే కేంద్రంలో అధికారంలో ఉండటంతో టిడిపి కాస్త ఆలోచనలో ఉంది. అలా అని ఏపీలో బిజేపికి ఏ మాత్రం బలం లేదు..ఒక్కశాతం ఓట్లు లేవు..ఒక్క సీటు గెలుచుకోలేదు. పైగా రాష్ట్రానికి న్యాయం చేయట్లేదని బిజేపిపై ప్రజలు కోపంగా ఉన్నారు. అందుకే బిజేపితో పొత్తుకు టిడిపి రెడీగా ఉండటం లేదు. దానికి తోడు బిజేపి..జగన్ కు సపోర్ట్ చేస్తుంది. టిడిపిపై విమర్శలు చేస్తుంది..టిడిపిని రాజకీయంగా తొక్కాలని చూస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇంకా టిడిపి నేతలు తెగించేశారు. బిజేపిని టార్గెట్ చేశారు. అసలు బిజేపికి ఒక్క సీటు రాదని, వైసీపీ-బిజేపి స్నేహం గురించి ప్రజలకు తెలుసని టిడిపి నేతలు కామెంట్ చేస్తున్నారు
.

ఇక టిడిపి వైపు పవన్ ని రాకుండా బిజేపి అడ్డుకుంటుందని అంటున్నారు. దీని బట్టి చూస్తే బిజేపితో పొత్తుకు టిడిపి అసలు రెడీగా లేదని తేలిపోయింది. ఈ క్రమంలో తేల్చుకోవాల్సింది పవన్ మాత్రమే..బిజేపితో కలిసి వెళితే పావలా ఉపయోగం ఉండదు. టిడిపితో కలిస్తే కనీసం గెలవచ్చు..అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది.
అయితే బిజేపి..పవన్‌ని టిడిపి వైపు రాకుండా అడ్డుకుంటున్నట్లు కనిపిస్తుంది. దీంతో పవన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. బిజేపితో కలిసి వెళ్తారా? లేక టిడిపి పొత్తుకు రెడీ అంటారేమో చూడాలి.