కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఏపీలో బిజేపి నేతలు ఏ స్థాయిలో హడావిడి చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. ఇంకా తమకు ఎదురులేదని, ఎవరైనా తమ వద్దకు రావాల్సిందే అని విధంగా రాజకీయం నడుపుతున్నారు. కేవలం ఒక్క శాతం ఓట్లు లేకపోయినా సరే..ఇంకా తమకు తిరుగులేదని అనుకుంటున్నారు. అదే సమయంలో పొత్తుల విషయంలో నచ్చిన విధంగా కామెంట్లు చేస్తూ వస్తున్నారు.
ముఖ్యంగా టిడిపిని ఏ విధంగా దెబ్బకొట్టాలని చూస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే బిజేపి..జగన్ కు ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది.. ఏ విధంగా కేంద్రం నుంచి సాయం అందిస్తుందో చెప్పాల్సిన పని లేదు. అంటే ఏపీలో మళ్ళీ జగన్ నే అధికారంలోకి తీసుకురావడానికి బిజేపి పడే కష్టం గురించి అందరికీ తెలిసిందే. అయితే కేంద్రంలో అధికారంలో ఉండటంతో రాజకీయ పరిస్తితులని బట్టి టిడిపి సైతం సైలెంట్ గా ఉంది. పెద్దగా బిజేపి జోలికి వెళ్లలేదు. కానీ ఇటీవల కాలంలో టిడిపితో కలవడానికి రెడీ అవుతున్న పవన్‌ని బిజేపి..పొత్తు పెట్టుకోకుండా చేస్తుందనే కామెంట్లు వచ్చాయి.

అంటే బిజేపి-జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేసి ఓట్లు చీల్చి టిడిపికి నష్టం చేసి..మళ్ళీ వైసీపీని అధికారంలో కూర్చోబెట్టి..ఈ సారి టిడిపిని తోక్కేసి..ఆ ప్లేస్ లోకి రావాలని బిజేపి ప్లాన్ చేసింది. ఆ దిశగానే బిజేపి రాజకీయం చేస్తుంది. దీంతో టిడిపి రివర్స్ గేర్ వేసింది..బిజేపి-వైసీపీ కలిసి ఉన్నాయనే సంగతి ప్రజలకు తెలిసేలా రాజకీయం మొదలుపెట్టారు.
తాజాగా అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ..బిజేపి టార్గెట్ గా ఫైర్ అయ్యారు. ఇక పవన్‌ని టిడిపి వైపుకు రాకుండా బిజేపి భయపెడుతుందని పితాని అంటున్నారు. కానీ ఏం చేసిన నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది టిడిపి అని చెబుతున్నారు. దీని బట్టి చూస్తే ఇంకా బిజేపితో పొత్తుకు టిడిపి కూడా రెడీగా లేదని తెలుస్తోంది. ఎలాగో కార్యకర్తలు బిజేపి పొత్తు వేస్ట్ అంటున్నారు. దాని వల్ల నష్టమే అంటున్నారు. మొత్తానికి బిజేపికి టిడిపి దూరమైనట్లే.