దేశంలో ఏ రాష్ట్రంలోనైనా బీజేపీ చేసే రాజకీయం అర్ధమవుతుంది గానీ, ఏపీలో ఆ పార్టీ నేతలు చేసే రాజకీయం మాత్రం అర్ధం కాదు. అసలు కొందరు బీజేపీ నేతలు తమ పార్టీ కోసం పనిచేస్తున్నారో పక్క పార్టీల కోసం పనిచేస్తున్నారో అర్ధం కాకుండా ఉంది. ఇప్పటికే ఏపీలో బీజేపీ, నోటాతో పోటీ పడే పరిస్తితి. ఈ పరిస్తితి నుంచి బయటపడాలంటే బీజేపీ నేతలు, పార్టీ కోసం పనిచేయాలి. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదుకోవాలి. అప్పుడే బీజేపీని ఏపీ ప్రజలు ఆదరించే పరిస్తితి వస్తుంది.

అప్పటివరకు బీజేపీ, నోటాతో పోటీ పడాల్సిందే. ఇక కొందరు నేతలు వల్ల నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చేలా ఉన్నాయి. అలాంటి నేతలకు చెక్ పెట్టాల్సిన అవసరముంది. అయితే తాజాగా తిరుపతి పర్యటనకు వచ్చిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా…ఏపీ బీజేపీ నేతలకు ఫుల్ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా వైసీపీకి అనుకూలంగా ఉన్న నాయకులని మందలించినట్లు సమాచారం.

ఇక రాష్ట్రంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న నేతలు ఎవరో జనాలకు బాగా తెలుసు. అందులో మొదటగా సోము వీర్రాజు పేరు ఉంటుంది. పేరుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు గానీ, ఈయన పనిచేసేది జగన్ కోసమే అన్నట్లు ఉంటుంది. ఎప్పటినుంచో ఇదే పరిస్తితి ఉందని చెప్పొచ్చు. ఈయనకు చంద్రబాబు అంటే అసలు పడదు…అందుకే అధికారంలో లేకపోయినా బాబుపైనే ఫైర్ అవుతారు…జగన్‌ని ఒక్క మాట అనరు.

ఇక ఈయన కాకుండా జీవీఎల్ నరసింహారావు…ఈయన గురించి చెప్పాల్సిన పని లేదు. పేరుకు తెలుగు వ్యక్తి….కానీ ఆ తెలుగు ప్రజలకు చేసేది ఏమి లేదు. కానీ రాజకీయంగా టీడీపీని తొక్కడానికి, జగన్‌ని లేపడానికి ఉపయోగపడతారు. అలాగే ఏపీ సహ ఇంచార్జ్ సునీల్ దేవధర్…ఈయనకు కూడా జగన్ అంటే ప్రేమ. అందుకే ఈ ముగ్గురు నేతలకు అమిత్ షా గట్టిగా క్లాస్ పీకి, ఇకనుంచైనా బీజేపీ కోసం పనిచేయమని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Discussion about this post