ప్రస్తుత రాజకీయాల్లో మీడియా పాత్ర ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అసలు మీడియా బట్టే రాజకీయాలు నడుస్తున్నాయనే విధంగా పరిస్తితి ఉంది. ప్రతి రాజకీయ పార్టీకి అనుకూల మీడియా సంస్థలు ఉండటం, ఆ మీడియా సంస్థలు అనుకూల పార్టీలకు భజన చేయడం…ప్రత్యర్ధి పార్టీలపై బురదజల్లడం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏపీలోని మీడియా సంస్థలకు ఇదే పని. అసలు న్యూట్రల్ మీడియా సంస్థలు ఉన్నాయా? అంటే అవి కంటికి కనిపించవు.

ఇక జనమే ఏ మీడియా ఎవరికి అనుకూలం చెప్పే పరిస్తితి. ఫలానా చానల్…ఫలానా పార్టీకి అనుకూలమని చెప్పేస్తున్నారు. అయితే ఏపీలో ప్రధాన పార్టీలైన అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలకు అనుకూల మీడియా సంస్థలు ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇందులో అధికార పార్టీ అనుకూల మీడియాని బ్లూ మీడియా అని, ప్రతిపక్ష టీడీపీ అనుకూల మీడియాని యెల్లో మీడియాని అంటారు.

ఈ మీడియా సంస్థలకు వేరే పని ఉండదు….బ్లూ మీడియా ఏమో జగన్‌కు భజన చేయడం, చంద్రబాబుపై బురదజల్లడం..అటు యెల్లో మీడియా ఏమో చంద్రబాబుకు భజన…జగన్‌పై విమర్శలు చేయడం చేస్తుంది. అయితే ఏపీలో బ్లూ మీడియా డామినేషన్ ఎక్కువైందనే విమర్శలు వస్తున్నాయి. మెజారిటీ మీడియా సంస్థలు జగన్‌కు బాకా ఊదడంలో ముందున్నాయని తెలుస్తోంది. కానీ సీఎం జగన్‌తో సహ వైసీపీ నేతలు యెల్లో మీడియా అంటూ రెండు, మూడు చానల్స్ పేరు చెప్పి విమర్శలు చేస్తారు. దాని వల్ల యెల్లో మీడియా అనేది బాగా హైలైట్ అవుతుంది తప్ప, అసలు డామినేషన్ చేస్తున్న బ్లూ మీడియా మాత్రం పైకి కనబడదు.

అసలు ఎక్కువ చానల్స్ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని సంగతి టీడీపీ నేతలు హైలైట్ చేయలేకపోతున్నారు. ఆ విషయం సీనియర్ నేత బుచ్చయ్య చౌదరీ లాంటి వారే చెబుతున్నారు. కొన్ని చీకటి చానల్స్‌తో వైసీపీ రాజకీయం చేస్తోందని అంటున్నారు. మరి ఆ చీకటి చానల్స్ ఏవో అందరికీ తెలుసనే అనుకోవాలి.

Discussion about this post