రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ లీడ్‌లోకి వస్తున్న విషయం తెలిసిందే..గత ఎన్నికల్లో ఓడిపోయిన చాలా సీట్లలో టీడీపీ పట్టు సాధిస్తుంది. ఇలా పట్టు సాధించిన సీట్లలో కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి. పార్టీలో ఉండే అంతర్గత విభేదాలు పెరిగి టీడీపీకి మైనస్ గా మారుతున్నాయి. ఇప్పుడు కృష్ణా జిల్లాలోని పెనమలూరు స్థానంలో కూడా అదే పరిస్తితి కనిపిస్తోంది.

మామూలుగానే ఇక్కడ టీడీపీకి కాస్త బలం ఎక్కువ.. కానీ కొన్ని పరిస్తితుల వల్ల అనూహ్యంగా ఓడిపోవాల్సి వస్తుంది. 2009లో 200 ఓట్ల తేడాతోనే ఓడిపోయింది. 2014ళో మాత్రం భారీ మెజారిటీతో బోడే ప్రసాద్ గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వైసీపీ ఒక్క ఛాన్స్ ఎఫెక్ట్, జనసేన ఓట్లు చీల్చడంతో పాటు టీడీపీలో ఉండే విభేదాలు కూడా టీడీపీ ఓటమికి కరనమయ్యాయి. అయితే ఓడిపోయిన తర్వాత త్వరగానే పెనమలూరులో పార్టీ బలం పుంజుకుంటూ వస్తుంది.

అక్కడ స్థానికంగా వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత రావడం, వైసీపీ సర్కార్‌పై వ్యతిరేకత, రాజధాని అంశాలు టీడీపీకి కలిసొస్తున్నాయి. ఇక అంతా బాగానే ఉందనుకునే లోపు ఇక్కడ అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇక్కడ మొదట నుంచి సీటు విషయంలో యలమంచిలి రాజేంద్రప్రసాద్, బోడే ప్రసాద్‌ల మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఇదే తరుణంలో బోడే ఒంటెద్దు పోకడలతో వెళుతూ..దివంగత చలసాని పండు వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఆ వర్గాన్ని దూరంగా పెడుతున్నారని కొందరు విమర్శలు చేస్తున్నారు. అటు చలసాని వర్గంలో ఓ యువ నేత బోడేకు ధీటుగా పెనమలూరులో పనిచేస్తున్నారు.

దీంతో అక్కడ టీడీపీలో గ్రూపు పోరు మొదలైంది. దీని వల్ల ఎన్నికల సమయంలో బోడేకు కొందరు సహకరించే పరిస్తితి కనిపించడం లేదు. అదే జరిగితే టీడీపీకి నష్టం. కాబట్టి ఈ పరిస్తితిని చంద్రబాబు చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. లేదంటే పెనమలూరులో టీడీపీకి డ్యామేజ్ జరుగుతుంది.

Leave feedback about this