గత ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. టీడీపీ ఓడిపోతుంది అనుకున్నారు గానీ….మరీ దారుణంగా ఓడిపోతుందని మాత్రం అనుకోలేదు. అలాగే కొందరు నాయకుల ఓటమి కూడా ఎవరూ ఊహించలేదు. కానీ అనూహ్యంగా గెలుస్తామనే ధీమాలో ఉన్న నాయకులు సైతం ఓటమి పాలవాల్సి వచ్చింది. అలా పెనమలూరులో బోడే ప్రసాద్ సైతం ఓటమి పాలయ్యారు. పెనమలూరు తెలుగుదేశం పార్టీకి బాగా బలం ఉన్న నియోజకవర్గం.

2014 ఎన్నికల్లో బోడే…టీడీపీ నుంచి పోటీ చేసి దాదాపు 31 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక ఐదేళ్లు ఎమ్మెల్యేగా మంచి పనితీరు కనబర్చారు. నియోజకవర్గంలో మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దీంతో పెనమలూరులో మరోసారి బోడే గెలవడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా జగన్ గాలితో పాటు..జనసేన పొత్తుతో పోటీ చేసిన బిఎస్‌పి ఓట్లు చీల్చడంతో బోడే ఓటమి పాలయ్యారు. బోడేపై గెలిచిన పార్థసారథికి 11 వేల మెజారిటీ వస్తే…బిఎస్‌పి పార్టీకి 15 వేల ఓట్లు వచ్చాయి. అంటే ఏ స్థాయిలో ఓట్లు చీలాయో అర్ధం చేసుకోవచ్చు.

అయితే ఎన్నికలై రెండున్నర ఏళ్ళు అయిపోయాయి. మరి ఇప్పుడు పెనమలూరులో పరిస్తితి ఎలా ఉంది? సారథికి పనితీరు ఎలా ఉంది? బోడేకు ప్రజా మద్ధతు పెరిగిందా? అంటే ఇప్పుడు పెనమలూరులో రాజకీయం చాలా వరకు మారింది. ఎమ్మెల్యేగా సారథి పనితీరుకు మంచి మార్కులు ఏమి పడటం లేదు. ఏదో పథకాలు ప్లస్ అవుతున్నాయి తప్ప…మరొక ప్లస్ లేదు. నియోజకవర్గంలో అభివృద్ధి నిల్.

అటు బోడే ప్రసాద్ ముందు నుంచి దూకుడుగానే పనిచేస్తున్నారు. ప్రజా సమస్యలపై గట్టిగానే పోరాటం చేస్తున్నారు. రెండున్నర ఏళ్లలోనే బోడే చాలా వరకు పికప్ అయ్యారని చెప్పొచ్చు. పైగా అమరావతి అంశం టీడీపీకి బాగా కలిసొస్తుంది. ఈ పరిణామాలని చూసుకుంటే నెక్స్ట్ ఎన్నికల్లో పెనమలూరులో బోడే రెండోసారి గెలవడం సులువే అని తెలుస్తోంది.

Discussion about this post