ఏపీలో రాజకీయ పరిణామాలు ఊహించని విధంగా మారుతున్నాయి. ఇప్పటికవరకు ఏపీలో అధికార వైసీపీ హవానే కొనసాగుతూ వస్తుంది. కానీ ఇకపై ఆ పరిస్తితి ఉండేలా లేదు…ప్రజలు వైసీపీకి కాస్త యాంటీగా మారడం మొదలైనట్లు కనిపిస్తోంది. తాజాగా జరిగిన మున్సిపల్, పరిషత్ ఎన్నికల ఫలితాల్లో ఆ మార్పు స్పష్టంగా తెలుస్తోంది. అయితే పూర్తిగా ప్రజలు వైసీపీకి యాంటీ అవ్వలేదు గానీ, కొంతవరకైతే మార్పు వచ్చిందని అర్ధమవుతుంది.

పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరిగిందని క్లియర్‌గా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఇప్పటికే పలు సర్వేలు చెప్పాయి. పైగా ఆయన నియోజకవర్గంలో ప్రజలకు సేవలు చేయడం కంటే సొంత సేవలు చేసుకోవడం ఎక్కువైందని, వినుకొండలో అక్రమాలు ఎక్కువయ్యాయని ఆరోపణలు వస్తున్నాయి.

అయితే రాజకీయంగా వచ్చే ఆరోపణలు నిజం కాదో తేల్చాల్సింది ఎన్నికలే….అది తాజాగా వినుకొండ పరిధిలోని శావల్యాపురం జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నిక రుజువు చేసింది. మొన్నటివరకు అధికార బలంతో వైసీపీ నేతలు ఎక్కడకక్కడ గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా అదే పరిస్తితి ఉంది….కానీ కొన్ని చోట్ల ప్రజలు అధికార బలాన్ని దాటి ప్రతిపక్ష టీడీపీకి మద్ధతు ఇచ్చారు. శావల్యాపురంలో కూడా అదే పరిస్తితి అక్కడి ప్రజలు బొల్లాకు షాక్ ఇస్తూ…ఆ జెడ్పీటీసీ స్థానంలో టీడీపీని గెలిపించారు.

వైసీపీ అభ్యర్ధి చుండూరి వెంకటేశ్వర్లుపై టీడీపీ అభ్యర్ధి పారా హైమావతి 1046 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మొదట నుంచి ఇక్కడ అధికార బలంతో జెడ్పీటీసీని కైవసం చేసుకోవాలని ఎమ్మెల్యే బొల్లా ట్రై చేశారు గానీ, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయలు…బొల్లాకు చెక్ పెట్టుకుంటూ వచ్చారు. బొల్లా ఎంత రెచ్చగొట్టిన తనదైన శైలిలో వ్యూహాలు వేస్తూ వచ్చి…శావల్యాపురంలో వైసీపీకి చెక్ పెట్టారు.

పైగా ఈ ఎన్నికలకు ముందు బొల్లా కాలుదువ్వి మరీ ఈ ఎన్నిక నీకు నాకు మధ్య ఎన్నిక అని చెప్పారు. ఇప్పుడు ఓటమితో బొల్లా నోట మాట రాని పరిస్థితి. ఈ ఫలితాన్ని బట్టి చూస్తే…వినుకొండలో మార్పు మొదలైందని తెలుస్తోంది. ఈ సారి వినుకొండ సీటు టీడీపీ ఖాతాలో పడటం ఖాయంగా కనిపిస్తోంది.

Discussion about this post