రాజకీయాలు ఎప్పుడూ.. ఒకేలా ఉండవు. బండ్లు.. ఓడలు.. ఓడలు బండ్లు అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మన ఏపీలో ఇలాంటి మార్పులు కూడా కామనే. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు.. పొలిట్ బ్యూరో.. సభ్యుడు.. బొండా ఉమా మహేశ్వరరావు.. విజ యంపై కాకుండా.. ఆయన మెజారిటీపై.. బెజవాడలో అప్పుడే చర్చ ప్రారంభమైంది. రాజకీయాలకు.. పురుటి గడ్డగా ఉన్న విజయవాడలో ఇలాంటి చర్చలు ఎప్పుడూ కామన్.

గత 2014 ఎన్నికల్లో బొండా ఉమా.. సెంట్రల్ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు. అయి తే.. గత ఎన్నికల్లో మాత్రం ఆయన జగన్ సునామీ ముందు గెలుపు ను అందుకోలేక పోయారు. అయితే.. ఇదేమీ ఘోరమైన పరాజయం కాదు. అంతకన్నా.. తలెత్తుకోలేని.. ఓటమి అంతకంటే.. కాదు.. ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన కౌంటింగులో కేవలం 25 ఓట్ల తేడాతో వైసీపీ నేత.. విష్ణు విజయం దక్కించుకున్నారు. ఇది గతం. సాధారణంగా.. విజయవాడ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి.కాబట్టి.. ఈ సంఖ్యను ప్రామాణికంగా తీసుకునే అవకాశం, అవసరం కూడా లేదు. అయితే.. వచ్చే ఎన్నికల నాటికి బొండా ఖచ్చితంగా 25 వేల ఓట్ల మెజారిటీ దక్కించుకుంటారనేది ఇప్పుడు జరుగుతున్న కీలక చర్చ. దీనికి ప్రధానంగా.. మూడు కారణాలు కనిపిస్తున్నాయని.. విజయవాడ రాజకీయ వర్గాలు చెబుతు న్నాయి. పార్టీలో దూకుడు పెరిగింది. సమస్య ఏదైనా.. కూడా బొండా ఉమా ప్రజల మధ్యే ఉంటున్నారు. వారి తరఫునే వాయిస్ వినిపిస్తున్నారు.

దీనికి తోడు.. టీడీపీ పుంజుకుంది. ఇక, ఎమ్మెల్యే విష్ణుకు.. ఆయన సొంత సామాజిక వర్గంలోనూ.. వ్యతిరేక త తీవ్రంగా ఉందని అంటున్నారు. తమకు ఏమీ చేయలేదని.. ఈ వర్గం తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తోం ది. ఎవరి ఓట్లు అయితే..తనను గెలిపిస్తాయని.. ఆశతో ఫైట్ చేసి మరీ.. గత ఎన్నికల్లో టికెట్ తెచ్చుకు న్నారో.. ఆ వర్గమే ఇప్పుడు.. ఎమ్మెల్యేకు యాంటీ అయింది. దీనికితోడు ఈ నియోజకవర్గంలో స్లమ్ ఏరియా ఎక్కువ. గత ఎన్నికల్లో ఇక్కడ అభివృద్ధి చేస్తానని చెప్పి చేయలేదు. సో.. ఇవన్నీ.. ఇప్పడు అనూహ్యంగా.. అయాచితవరంగా.. బొండాకు కలిసి వస్తాయని.. అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Discussion about this post