ఉమ్మడి విజయనగరం జిల్లా అంటే బొత్స సత్యనారాయణ పేరు ఎక్కువగా గుర్తొస్తుందనే చెప్పాలి. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో పెత్తనం ఉంటుంది. గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు, ఇప్పుడు వైసీపీలో ఉన్నా సరే విజయనగరంలో బొత్సదే హవా. ఇక దాదాపు మూడు, నాలుగు స్థానాల్లో బొత్సకు బంధువులు లేదా అనుచరులు ఎమ్మెల్యేలుగా ఉంటారు.

ఇంకా శృంగవరపుకోట, పార్వతీపురం, బొబ్బిలి లాంటి చోట్ల బొత్స అనుచరులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయినా సరే బొత్స మరో సోదరుడు లక్ష్మణరావు…నెల్లిమర్ల సీటుపై కన్నేశారు. ఆ సీటులో వైసీపీ ఎమ్మెల్యే బద్దుకొండ అప్పలనాయుడు ఉన్నారు. కానీ ఆయన్ని సైడ్ చేయాలని చెప్పి లక్ష్మణరావు ట్రై చేస్తున్నారు. ఇదే క్రమంలో నెల్లిమర్లలో లక్ష్మణరావు సెపరేట్ గా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో ఆ మధ్య ఎమ్మెల్యే అప్పలనాయుడు..మీ తమ్ముడు నా నియోజకవర్గంలో ఇబ్బందులు సృష్టిస్తున్నారు..మీరు నియత్రించకపోతే ఎంత దూరమైన వెళ్తానని..బొత్సకు వార్నింగ్ ఇచ్చారు. ఇలా నెల్లిమర్లలో పెద్ద రచ్చ నడుస్తోంది. ఈ ఆధిపత్య పోరుతో నెల్లిమర్ల సీటుని కోల్పోయేలా ఉన్నారు.

గత ఎన్నికల్లో కూడా జిల్లాలో వైసీపీ 9కి 9 సీట్లు గెలవడంలో బొత్స పాత్ర కీలకం. అందుకే అధికారంలోకి వచ్చాక జిల్లాపై ఆయన పెత్తనం కొనసాగుతుంది. పైగా మంత్రిగా ఉండటంతో జిల్లాలో బొత్స హవా ఎక్కువ. అయితే బొత్స అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన బంధువులు అధికారం చెలాయించడం కామన్ అయిపోయింది. ఇక వారి వల్ల సొంత వైసీపీ నేతలే ఇబ్బంది పడే పరిస్తితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే బొత్స చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సోదరుడు బొత్స అప్పలనరసయ్య గజపతినగరం ఎమ్మెల్యేగా ఉన్నారు.
