విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ బలం ఏంటో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు…జిల్లాలో సగం నియోజకవర్గాలని ప్రభావితం చేయగల శక్తి బొత్సకు ఉంది..బొత్స లాంటి నాయకుడు ఉండటం వల్లే గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ విజయనగరంలో స్ట్రాంగ్‌గా ఉన్నాయని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో విజయనగరంలో వైసీపీ క్లీన్‌స్వీప్ చేయడంలో బొత్స కీలకపాత్ర పోషించారు. జిల్లాలో 9కి 9 సీట్లు వైసీపీ గెలుచుకుంది.

ఇందులో ఐదు సీట్లు బొత్స ప్రభావం వల్ల గెలిచినవనే చెప్పొచ్చు.. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ గెలిచిన విషయం తెలిసిందే..అటు గజపతినగరంలో బొత్స సోదరుడు బొత్స అప్పలనరసయ్య విజయం సాధించారు..అటు నెల్లిమర్లలో బొత్స బంధువు….బద్దుకొండ అప్పలనాయుడు గెలిచారు. పార్వతీపురంలో అలజంగి జోగారావు, శృంగవరపుకోటలో కడుబండి శ్రీనివాసరావులు గెలిచారు. ఈ ఇద్దరు బొత్స సన్నిహితులే. ఇలా ఐదు సీట్లలో బొత్సకు సంబంధించిన వారే గెలిచారు.

అయితే నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ బొత్స వర్గం సత్తా చాటుతుందా? ఈ ఐదుగురుకి మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయా? అంటే బొత్స విజయం విషయంలో ఎలాంటి డౌట్ లేదనే చెప్పొచ్చు..ఆయన మళ్ళీ చీపురుపల్లిలో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి బొత్సని పక్కనబెడితే….మిగిలిన నలుగురు గురించి మాట్లాడుకుంటే…గజపతినగరంలో బొత్స సోదరుడు అప్పలనరసయ్య స్ట్రాంగ్‌గానే ఉన్నారు..కాకపోతే ఇక్కడ టీడీపీ కూడా బలంగా ఉంది..కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో ఏం జరుగుతుందో చెప్పలేం.

ఇటు శృంగవరపుకోటలో ఎమ్మెల్యే శ్రీనివాసరావుపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది..ఈయనకు మళ్ళీ గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని ప్రచారం జరుగుతుంది…కాబట్టి ఈ సీటు డౌట్ అని చెప్పొచ్చు. అటు పార్వతీపురంలో జోగారావు పరిస్తితి కూడా డౌట్ గానే ఉంది…ఆయనపై కూడా వ్యతిరేకత కనిపిస్తోంది. అంటే ఈ సీటులో కూడా వైసీపీ గెలుపు కష్టమనే చెప్పొచ్చు. అలాగే నెల్లిమర్లలో అప్పలనాయుడు పరిస్తితి కూడా మెరుగ్గా లేదు…ఈయనకు పోటీగా టీడీపీ వస్తుంది. మొత్తానికి చూసుకుంటే ఈ సారి బొత్స వర్గానికి షాక్ తగిలేలా ఉంది.



Discussion about this post