విజయనగరం జిల్లా పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చే పేరు…బొత్స సత్యనారాయణ…జిల్లా రాజకీయాలపై బొత్సకు ఎంత పట్టు ఉందో చెప్పాల్సిన పని లేదు. జిల్లా రాజకీయాలని శాసించే శక్తి బొత్సకు ఉంది. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న, ఇప్పుడు వైసీపీలో ఉన్నా సరే బొత్స హవా నడుస్తూనే ఉంది. ఇక జిల్లాలో నాలుగైదు నియోజకవర్గాల్లో ఈయన అండర్‌లోనే ఉంటాయి. ఈయన వర్గానికి చెందిన వారే లీడ్ చేస్తూ ఉంటారు. గత ఎన్నికల్లో కూడా బొత్స వర్గానికి చెందిన వారే సత్తా చాటారు. బొత్సలో ఎలాగో చీపురుపల్లిలో గెలిచిన విషయం తెలిసిందే. అటు బొత్స సోదరుడు అప్పలనరసయ్య గజపతినగరంలో గెలిచారు.

ఇక బొత్స బంధువు బద్దుకొండ అప్పలనాయుడు నెల్లిమర్లలో గెలిచారు. అలాగే బొత్స అనుచరులుగా ఉన్న అలజంగి జోగారావు..పార్వతీపురంలో, కడుబండి శ్రీనివాసరావు శృంగవరపుకోటలో గెలిచారు. ఇలా బొత్స వర్గమే విజయనగరంలో డామినేషన్ చేస్తుంది. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా బొత్స వర్గం సత్తా చాటుతుందా? అంటే చెప్పలేని పరిస్తితి ఉంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుంది. అలాగే ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు కూడా పికప్ అవుతున్నారు.

ముఖ్యంగా ఎస్.కోట ఎమ్మెల్యే శ్రీనివాసరావుపై వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తోంది. ఈయన ప్రజలకు అందుబాటులో ఉండేది కూడా తక్కువని తెలుస్తోంది. ఇటు చూస్తే పార్వతీపురంలో జోగారావు పరిస్తితి కూడా బాగోలేదు. ఇక్కడ వైసీపీలో గ్రూపు తగాదాలు ఎక్కువ ఉన్నాయి. దీంతో టీడీపీకి బాగా అడ్వాంటేజ్ అవుతుంది.

అలాగే నెల్లిమర్లలో అప్పలనాయుడుకు ఈ సారి కలిసొచ్చేలా లేదు. అయితే గజపతినగరంలో బొత్స సోదరుడు అప్పలనరసయ్య కాస్త స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఇక బొత్స వర్గంలో ఉన్న డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణికి కూడా యాంటీ ఎక్కువ ఉంది. కురుపాం నియోజకవర్గంలో వైసీపీకి అనుకూల పరిస్తితులు లేవు. మొత్తానికి చూసుకుంటే ఈ సారి బొత్స వర్గానికి షాక్ తగిలేలా ఉంది.

Discussion about this post