రాజకీయాల్లో నాయకులు ఎప్పుడు ప్రత్యర్ధులని తక్కువ చేసి మాట్లాడకూడదు. రాజకీయంగా ఏదైనా విమర్శలు చేస్తే పర్లేదు గానీ, అలా కాకుండా నాయకులని ఎగతాళి చేసి మాట్లాడితే సీన్ రివర్స్ అయిపోతుంది. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా, ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ని బాగా ఎగతాళి చేశారు. రాజకీయ పరమైన విమర్శలే కాకుండా, వ్యక్తిగతంగా జైలు జీవితం గురించి మాట్లాడుతూ…జైలుకు వెళ్ళడం ఖాయమని, ఇక జన్మలో సీఎం కాలేరంటూ మాట్లాడారు.

తీరా 2019 ఎన్నికల్లో చూస్తే సీన్ రివర్స్ అయింది. జగన్ భారీ మెజారిటీతో సీఎం సీటులో కూర్చున్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలు కూడా అదే విధంగా చంద్రబాబు, నారా లోకేష్‌లని ఎగతాళి చేస్తున్నారు. ముఖ్యంగా లోకేష్‌పై ఎలా సెటైర్లు వేస్తారో చెప్పాల్సిన పని లేదు. ఆయన్ని పప్పు పప్పు అంటూ ఎగతాళి చేసేవారు. అలా పప్పు అని ఎగతాళి చేస్తుంటేనే….లోకేష్ ఏ విధంగా తన రాజకీయాన్ని మార్చారో అందరికీ తెలిసిందే. పప్పు కాస్త ఫైర్ బ్రాండ్ అన్నట్లు తయారయ్యారు. దీనికి కారణం వైసీపీ నేతలే అని చెప్పొచ్చు.

ఇక తాజాగా ఎన్ని జన్మలెత్తినా లోకేష్ ఎమ్మెల్యే కాగలడా? అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఎగతాళిగా మాట్లాడారు. అంటే జీవితంలో లోకేష్ ఎమ్మెల్యేగా గెలవడం కష్టమన్నట్లు చెప్పుకొచ్చారు. అసలు మంగళగిరి పోటీ చేసింది ఒకసారి….ఓడిపోయింది కూడా అప్పుడే. అంటే అంతటితో జీవితం అయిపోయినట్లు కాదు. లోకేష్‌కు ఇంకా చాలా భవిష్యత్ ఉంది. రాజకీయంగా ఇంకా చాలా చూడాలి. ఇక నెక్స్ట్ కూడా ఓడిన మంగళగిరిలోనే పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక అప్పుడే లోకేష్ ఎమ్మెల్యే అవుతారో లేదో బొత్స చూస్తారని టీడీపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి.

జన్మలు కాదు గానీ, నెక్స్ట్ ఎన్నికల్లోనే లోకేష్ ఎమ్మెల్యే అవ్వడం చూస్తారని, బొత్స కూడా గెలిచి అసెంబ్లీకి వస్తే, అసెంబ్లీలోనే కలుసుకుంటారని అంటున్నారు.

Discussion about this post