April 2, 2023
TDP latest News YCP latest news

 బొత్స-ధర్మానలతో ఈజీ కాదు..టీడీపీకి ఛాన్స్ లేనట్లే!

 ఉత్తరాంధ్రలో రాజకీయ సమీకరణాలు మారుతున్న విషయం తెలిసిందే. వైసీపీ ఆధిక్యం పడిపోతుండగా, టి‌డి‌పి హవా పెరుగుతుంది. విశాఖ రాజధాని కాన్సెప్ట్ వైసీపీకి వర్కౌట్ అయినట్లు కనిపించడం లేదు. ఇటీవల వచ్చిన సర్వేలో టి‌డి‌పికి ఆధిక్యం కనిపించింది. తాజాగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఫలితంలో కూడా టి‌డి‌పి హవానే ఉంది. దీంతో ఉత్తరాంధ్రలో టి‌డి‌పి ఆధిక్యం ఉంది.

అయితే టి‌డి‌పికి ఆధిక్యం ఉన్నా సరే కొన్ని సీట్లలో వైసీపీని ఓడించడం కష్టమని తెలుస్తోంది. మొన్నటివరకు మంత్రులుగా చేసి మాజీలైన వారు, ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారి స్థానాలని ఒక్కసారి చూస్తే..ప్రస్తుతం ధర్మాన ప్రసాదరావు, అప్పలరాజు, రాజన్న దొర, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు మంత్రులుగా ఉన్నారు. లేటెస్ట్ సర్వేలో ధర్మాన, గుడివాడ, అప్పలరాజు ఓటమి ఖాయమని తేలింది.

కానీ బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లిలో టి‌డి‌పి గెలవడం కష్టమని తేలింది. అటు ముత్యాలనాయుడు ఉన్న మాడుగులలో సైతం వైసీపీ గెలుపుకు ఛాన్స్ ఉంది. రాజన్న దొర ప్రాతినిధ్యం వహించే సాలూరులో సైతం టి‌డి‌పి గెలవడం ఖాయమని తేలింది.

అయితే ధర్మాన ఉన్న శ్రీకాకుళంలో, గుడివాడ ఉన్న అనకాపల్లిలో, అప్పలరాజు ఉన్న పలాసలో టి‌డి‌పి గెలుపు ఖాయమని తేలింది. ఇక మాజీ మంత్రులు.. ధర్మాన కృష్ణదాస్ ఉన్న నరసన్నపేటలో టి‌డి‌పికి గెలవడం కష్టమని తేలింది. ఇటు పుష్పశ్రీ వాణి ప్రాతినిధ్యం వహిస్తున్న కురుపాంలో టి‌డి‌పి గెలుపుకు కష్టపడాలి. ఇక అవంతి శ్రీనివాస్ ఉండే భీమిలిలో టి‌డి‌పి గెలుపు సులువు అని తేలింది. అంటే కొన్ని చోట్ల టి‌డి‌పి ఇంకా బలపడాల్సిన అవసరం ఉంది.