Site icon Neti Telugu

బీఆర్ఎస్‌తో ఏపీలో కేసీఆర్ స్కెచ్..వర్కౌట్ డౌటే

ఏపీ రాజకీయాల్లోకి కేసీఆర్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న కేసీఆర్…మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చూస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఏపీలో బీఆర్ఎస్ శాఖ మొదలుపెట్టారు.

తాజాగా ఏపీకి చెందిన పలువురు కీలక నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబులతో పాటు పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు. అలాగే తోట చంద్రశేఖర్‌ని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడుగా పెట్టారు. రావెలకు జాతీయ స్థాయిలో కీలక పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక ఇలా ఏపీ రాజకీయాల్లోకి కేసీఆర్ వచ్చారు. అయితే కేసీఆర్..రాజకీయాల వల్ల ఏపీలో ప్రధానంగా ఉన్న వైసీపీ-టీడీపీల్లో ఎవరికి నష్టం జరుగుతుందో క్లారిటీ లేకుండా ఉంది. ప్రస్తుతానికి ఆయన కాపు సామాజికవర్గంపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాపులు జనసేన వైపు చూస్తున్నారు..జనసేన-టీడీపీ పొత్తు పెట్టుకునే ఛాన్స్ ఉంది. ఇక కాపు ఓట్లు చీలితే టీడీపీ- జనసేనలకు నష్టమని ప్రచారం వస్తుంది.  

అయితే అది ప్రచారం వరకే ఎందుకంటే..ఇప్పటిలో ఏపీలో కేసీఆర్ ప్రభావం ఉండకపోవచ్చు. పైగా అందులో చేరిన నేతలు..కాస్త ప్రజా బలం తక్కువ ఉన్నవారు..ఇంకా బలమైన నాయకులు చేరితే పరిస్తితి మారుతుందేమో గాని..ఇప్పటికైతే బీఆర్ఎస్ ప్రభావం వల్ల ఎవరికి లాభం లేదు..ఎవరికి నష్టం లేదు. మరి రానున్న రోజుల్లో రాజకీయం ఎలా మారుతుందో చెప్పలేం. 

Exit mobile version