గత కొన్ని రోజుల నుంచి కడప రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే వివేకానందరెడ్డి హత్య కేసులో పలు మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో దేవి శంకర్ రెడ్డిని అరెస్ట్ కూడా చేశారు. ఇక శంకర్ రెడ్డి వైసీపీ నేత అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో టీడీపీకి చెందిన బీటెక్ రవి ప్రమేయం ఉందని వైసీపీ వాదిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇంతవరకు బీటెక్ రవి ప్రమేయం ఉన్నట్లు ఎక్కడా తేలలేదు.

ఈ క్రమంలోనే తనపై వస్తున్న ఆరోపణలకు బీటెక్ రవి సైతం గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. వివేకా కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి జైలుకు వెళితే.. ఇక్కడ నాయకత్వ సమస్య వస్తుందని.. తమను వైసీపీలోకి రమ్మని ఆ పార్టీ నాయకులు ఇప్పటికీ అడుగుతున్నారని, అలాగే అవినాష్‌కు సపోర్ట్ చేయకపోతే బీజేపీలోకి వెళ్తారని, అందుకే తనకు సపోర్ట్ చేయాల్సి వస్తుందని జగన్, వివేకా కుటుంబ సభ్యులకు చెప్పిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

అలాగే వివేకా హత్యలో అవినాష్, శంకర్ రెడ్డిలకు సంబంధం లేదని దేవుడు మీద ప్రమాణం చేయగలరా? అని సవాల్ చేశారు. అయితే బీటెక్ రవి కామెంట్లతో కడప రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. ఈయన మాటల్లో వాస్తవం ఉందో లేదో క్లారిటీ లేదు గాని, ఇప్పుడు ఈ ఇష్యూ జగన్‌కు పెద్ద తలనొప్పి అయింది. అదే సమయంలో బీటెక్ రవికి వైసీపీలో చేరమని ఆఫర్ ఎవరు ఇచ్చారని చర్చ కూడా నడుస్తోంది.

అంటే అవినాష్ బీజేపీలోకి వెళితే….బీటెక్ రవికి కడప ఎంపీ సీటు గాని ఇస్తామని ఆఫర్ ఇచ్చారా? అనే చర్చ కడపలో నడుస్తోంది. కాకపోతే బీటెక్…ఈ విషయాలని బయటపెట్టారంటే…వైసీపీలోకి వెళ్ళడం లేదనే చెప్పొచ్చు. మొత్తానికి ఒక దెబ్బతో కడప జిల్లా రాజకీయాలనే మార్చేశారు. మరి దీనిపై వైసీపీ నుంచి ఎలాంటి కౌంటర్లు వస్తాయో చూడాలి.

Discussion about this post