గోరంట్ల బుచ్చయ్య చౌదరీ ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు..ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత.రాజమండ్రి సిటీ నుంచి నాలుగుసార్లు..రూరల్ నుంచి రెండుసార్లు గెలిచారు. అయితే సిటీ నుంచి 2014 లో రూరల్ సీటుకు మారారు. పొత్తులో భాగంగా సిటీ సీటుని బిజేపికి ఇవ్వడంతో ఆయన రూరల్‌కు మారాల్సి వచ్చింది. అయినా సరే రూరల్ లో గెలిచి సత్తా చాటారు. ఇక 2019 ఎన్నికల్లో సిటీ సీటు నుంచి ఆదిరెడ్డి భవాని పోటీ చేయగా, రూరల్ నుంచి బుచ్చయ్య మళ్ళీ బరిలో దిగారు. ఇద్దరు విజయం సాధించారు.
అయితే వచ్చే ఎన్నికల్లో సిటీ సీటు ఆదిరెడ్డి ఫ్యామిలీకే దక్కడం ఖాయం. అందులో ఎలాంటి డౌట్ లేదు. మరి రూరల్ సీటు బుచ్చయ్యకు దక్కుతుందా? అంటే అదే క్లారిటీ లేకుండా ఉంది. అది ఏంటి ఆయనకు సీటుపై క్లారిటీ లేకపోవడం ఏంటి అనుకోవచ్చు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. వరుసగా రూరల్ లో గెలుస్తున్న బుచ్చయ్యకు జనసేనతో ఒక చిక్కు వచ్చి పడింది. రూరల్ సీటులో జనసేన బలం పెరగడం వల్ల ఆయనకు కాస్త రిస్క్ పెరిగింది.

గత ఎన్నికల్లో బుచ్చయ్య 74 వేల ఓట్లు తెచ్చుకుని వైసీపీపై 10 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అదే సమయంలో అక్కడ జనసేనకు 42 వేల ఓట్లు వరకు పడ్డాయి. అంటే జనసేన బలం ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇటీవల సర్వేల్లో అక్కడ జనసేన బలం మరింత పెరిగిందని, జనసేన గెలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
దీంతో పొత్తు ఉంటే రాజమండ్రి రూరల్ సీటు జనసేనకు ఇచ్చి బుచ్చయ్యని వేరే సీటుకు పంపిస్తారనే టాక్ వస్తుంది. అలా కాకుండా సీనియర్ నేత కాబట్టి బుచ్చయ్యకు రూరల్ సీటు ఇచ్చి..జనసేనకు వేరే సీటు కేటాయిస్తారేమో చూడాలి.
