May 31, 2023
ap news latest AP Politics

బుద్దా-నాగుల్ మీరాకు సీట్లు ఎక్కడ?

విజయవాడ తెలుగుదేశం పార్టీలో బుద్దా వెంకన్న, నాగుల్ మీరా లాంటి కీలక నేతలు..ఎప్పటినుంచో సీటు ఆశిస్తున్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు భక్తుడుగా చెప్పుకునే బుద్దాకు ఎమ్మెల్సీ పదవి దక్కింది..అలాగే ఆ పదవీకాలం ముగిసింది. దీంతో బుద్దాని..ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జ్ గా పెట్టారు. ఇటు నాగుల్ మీరా ఎప్పటినుంచో పార్టీలో పనిచేస్తున్నారు. ఈయన విజయవాడ వెస్ట్ సీటు ఆశిస్తున్నారు. కానీ ఇంతవరకు సీటు దక్కలేదు.

ఈ సీటు విషయంలో ఎంపీ కేశినేని నానితో బుద్దాకు విభేదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కేశినేని నాని విజయవాడ వెస్ట్ ఇంచార్జ్ గా ఉన్నారు. అయితే ఈ సీటుపై బుద్దా కన్నేశారు. మొదట నుంచి ఆ నియోజకవర్గంలో పనిచేస్తున్న బుద్దా..తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, అసెంబ్లీకి వెళ్ళి చంద్రబాబుని అవమానించిన వారి పని పడతానని అన్నారు. ఈ సరి తాను, నాగుల్ మీరా అసెంబ్లీలో అడుగుపెడతామని అంటున్నారు.

దీని బట్టి చూస్తే బుద్దా, నాగుల్ మీరా సీటు ఆశిస్తున్నారని తెలుస్తోంది. సీటు ఆశించడం బాగానే ఉంది..కానీ వారికి ఇవ్వడానికి ఏ సీటు ఖాళీ లేదు. ఉన్న ఒక్క విజయవాడ వెస్ట్ సీటు..పొత్తు ఉంటే తప్పనిసరిగా జనసేనకు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏ సీటు ఖాళీ లేదు..మరి అలాంటప్పుడు పోటీ చేస్తానని బుద్దా ఎలా చెబుతున్నారనేది అర్ధం కాకుండా ఉంది.

చంద్రబాబు ఏమన్నా బుద్దాకు గాని, నాగుల్ మీరాలకు ఛాన్స్ ఇస్తారనేది క్లారిటీ లేదు. ఏ సీటు ఖాళీ లేదు కాబట్టి..మళ్ళీ ఎమ్మెల్సీ పదవే ఇచ్చే అవకాశం ఉంది.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video