వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అధికారికంగా పొత్తుపై క్లారిటీ రాలేదు గాని..ఇంటర్నల్ గా మాత్రం పొత్తు ఫిక్స్ అని తెలుస్తోంది. అలాగే టీడీపీ కొన్ని సీట్లని జనసేనకు త్యాగం చేసే విషయంలో చర్చ కూడా నడుస్తోంది. ఇప్పటికే సీట్లపై చర్చ నడుస్తుందని, కొన్ని సీట్లని జనసేనకు ఇవ్వడానికి రెడీ అయిందని తెలుస్తోంది. ఇదే క్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన ఎక్కువ సీట్లు అడుగుతున్నట్లు సమాచారం.

ఇదే క్రమంలో అక్కడ జనసేనకు రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ సిటీ లేదా రూరల్, రాజానగరం, రామచంద్రాపురం, పిఠాపురం లాంటి సీట్లు దక్కుతాయని సమాచారం. అదే సమయంలో రాజమండ్రిలో ఒక సీటు జనసేన అడుగుతున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి సిటీ, రూరల్ సీట్లు ఉన్నాయి. 2014లో బీజేపీతో పొత్తులో భాగంగా సిటీ సీటుని టీడీపీ వదులుకుంది. ఇక 2019 ఎన్నికల్లో ఆ రెండు సీట్లు టీడీపీ గెలిచింది.

అయితే ఈ రెండు సీట్లు టీడీపీ చేతుల్లో ఉన్నాయి. కానీ రూరల్ సీటులో జనసేనకు బలంగా ఎక్కువ ఉంది. గత ఎన్నికల్లో 30 వేల పైనే ఓట్లు పడ్డాయి. దీంతో రూరల్ సీటు జనసేన అడుగుతుందని సమాచారం. కానీ అక్కడ టీడీపీ సీనియర్ బుచ్చయ్య చౌదరీ ఉన్నారు. ఆయన్ని కాదని రూరల్ సీటు జనసేనకు ఇవ్వడం కష్టమైన పని. పోనీ బుచ్చయ్యకు సిటీకు పంపాలంటే అక్కడ ఆదిరెడ్డి ఫ్యామిలీ ఉంది. కాబట్టి రాజమండ్రి రూరల్ సీటు జనసేనకు ఈజీగా దక్కడం కష్టం. ఏమైనా మార్పులు చేసి బుచ్చయ్యని ఒప్పిస్తేనే ఆ సీటు దక్కే ఛాన్స్ ఉంది. కానీ వచ్చే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అన్నట్లు బుచ్చయ్య బరిలో దిగుతున్నారు. కాబట్టి బుచ్చయ్యని కాదని రూరల్ సీటు జనసేనకు ఇవ్వడం కష్టమే.

Leave feedback about this