బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. రాష్ట్ర యువన జన, క్రీడల కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న యువ నాయకుడు. కర్నూలు జిల్లాలో తనకు తిరుగులేదని పదే పదే చెబుతున్ననేత. ముఖ్యంగా నందికొట్కూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్థర్‌పై పైచేయి సాధించి.. తనకు తిరుగులేని విధంగా రాజకీయాలు చేస్తున్నారనే వాదన ఉంది. అయితే.. వచ్చే ఎన్నికల నాటికి జిల్లాలోని ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని బైరెడ్డి భావిస్తున్నారు. ముఖ్యంగా పాణ్యంపై ఈయన దృష్టి పెట్టినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

యువ నాయకుడు కావడం, ప్రధానంగా సీఎం జగన్ దగ్గర మంచి మార్కులు ఉండడం.. మాట తీరుతో ప్రజలను ఆకట్టుకునే సత్తా సొంతం కావడం వంటివి బైరెడ్డికి కలిసి వస్తున్నాయి. అదేసమయంలో నెల్లూరుకు చెందిన మంత్రి, కర్నూలు జిల్లా ఇంచార్జ్ మంత్రి అనిల్‌కుమార్ యావద్‌కు అత్యంత సన్నిహితుడుగా.. ఇటీవల కాలంలో బైరెడ్డి గుర్తింపు పొందారు.. బైరెడ్డి చెప్పిందే.. అనిల్ వింటున్నారు. ఈ నేపథ్యంలో పాణ్యం అయితే.. తనకు అనుకూలంగా ఉంటుందని.. ఆయన భావిస్తున్నారని.. లోకల్ టాక్ వినిపిస్తోంది.

అయితే.. పాణ్యంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతేకాదు.. ఇప్పటి వరకు ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్నారు. స్థానికంగా మంచి పేరు ఉండడంతోపాటు.. కేడర్ కూడా బలంగా ఉంది. అయితే.. వయసు రీత్యా వచ్చే ఎన్నికల్లో జగన్ యువతకే ప్రాధాన్యం ఇస్తారని.. ప్రచారం జరుగుతుండడంతో కాటసానిని పక్కన పెట్టి, తనకు ఇవ్వాలని.. బైరెడ్డి కోరుతున్నట్టు తెలుస్తోంది. కానీ, ఈ విషయం బయటకు రావడంతో కాటసాని ముందు నుంచి అలెర్ట్ అయ్యారు. బైరెడ్డిని కనీసం.. నియోజకవర్గంలోకి కూడా రాకుండా జాగ్రత్తలు పడుతున్నారని తెలుస్తోంది.

అయితే.. తన సొంత మీడియా సహా సోషల్ మీడియాలోనూ.. బైరెడ్డి తీవ్రస్థాయిలో ప్రచారం చేయించు కుంటున్నారట. తనకు స్థానికంగా విజయం దక్కించుకునేందుకు ఛాన్స్ ఉందని.. తననకు తిరుగులే దని.. పాణ్యం అయితే.. బాగుంటుందని.. బైరెడ్డి వర్గం ప్రచారం జోరుగా చేస్తోంది. అయితే.. కాటసాని వర్గం మాత్రం తమ నియోజకవర్గంలోకి బైరెడ్డిని ఎట్టిపరిస్థితిలోనూ అడుగు పెట్టించేది లేదని అంటున్నారు. దీంతో బైరెడ్డి కలలు ఏమేరకు సక్సెస్ అవుతాయోనని ఇక్కడి నేతల మధ్య చర్చ సాగుతుండడం గమననార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Discussion about this post