ఏపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి ఎవరు బలం..? నాయకులా? పార్టీ అధినేతా? అంటే.. కాదనే సమాధానం వస్తుంది. ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఒప్పుకొంటారు. పార్టీకి ఆది నుంచి కూడా కేడరే బలమని ఆయన ఎప్పటికప్పుడు సంకేతాలు పంపుతూనే ఉన్నారు. తాజాగా మహానాడులో కూడా ఇదే రుజువైంది. కేడర్ ఎంత బలంగా ఉందో టీడీపీ ఒంగోలు వేదికగా నిర్వహించిన మహానాడు నిరూపించింది. తాజాగా నిర్వహించిన మహానాడు.. కార్యకర్తలతో జోష్ పెంచింది.

ఎక్కడెక్కడి నుంచో కార్యకర్తలు.. వరద ప్రవాహంలా.. మహానాడుకు ఉరకలెత్తారు. నిజానికి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సహకారం లేక పోగా.. ఎక్కడికక్కడ నిర్బంధాలు కూడా ఎదురయ్యాయి. మహానాడుకు బస్సులు పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వలేదు. పైగా.. కొన్ని కొన్ని టీడీపీ అనుకూల జిల్లాల్లో ఆర్టీసీ బస్సులను తాత్కాలికంగా.. వేరే జిల్లాలకు తరిలించారు. అంతేకాదు.. కేడర్ రాకుండా.. కూడా అనేక ఆంక్షలు విధించారు. బస్సులు కానీ… కార్లు కానీ.. ఇవ్వడాననికి వీల్లేదని.. ప్రైవేటు ట్రావెల్స్‌కు హుకుం జారీ చేశారు.

అయితే.. ఇన్ని చేసినా.. కూడా కేడర్ వెల్లువలా దూసుకువచ్చింది. తొలిరోజు మహానాడులో వచ్చిన జనం చూసే.. పార్టీ నేతలకు.. ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే.. 12 వేల మంది వస్తారని..అంచనా వేసుకుని.. 15 వేల మందికే ఏర్పాట్లు చేస్తారు. ఒకవేళ పెరిగితే.. మరో మూడు వేల మంది వరకు పెరుగుతారని.. అనుకున్నారు.కానీ, తొలిరోజే 20 వేల మంది వచ్చారు. దీంతో వారికి చేయాల్సిన ఏర్పాట్లు చేయలేక పోయారు. వండి ఆహారం కూడా సరిపోని పరిస్థితి ఏర్పడింది.

ఇక, రెండోరోజు అయితే.. ఇక… చెప్పడానికి మాటలు చాలనంత జనం వచ్చారు. కార్లు.. సొంత వాహనాలు పెట్టుకుని.. మరీ మహానాడుకు పోటెత్తారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. కొన్నిచోట్ల అయితే.. ఎడ్ల బళ్లు పెట్టుకుని మరీ.. మహానాడుకురావడం కనిపించింది. మహిళలు..యువత కూడా భారీ సంఖ్యలో పోటెత్తారు. ఈ ప్రభంజనం.. ఎన్టీఆర్ జీవించి ఉన్నసమయంలో చూశామని..మళ్లీ ఇప్పుడే చూస్తున్నామని. మహానాడుకు వచ్చిన వారు వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని చంద్రబాబు సైతం చెప్పుకొచ్చారు. సో..దీనిని బట్టి.. పార్టీకి కేడర్ ఎంత బలంగా ఉందో అర్ధమవుతోందని అంటున్నారుపరిశీలకులు.

Discussion about this post