అంబటి రాంబాబు, రోజా..మంత్రులు..తమ శాఖలకు సంబంధించి చేసే పనులు తక్కువ, మాట్లాడేది తక్కువ..ఎంతసేపు చంద్రబాబు, పవన్‌లని తిట్టేది ఎక్కువ. వారిని తిట్టడానికే వీరు మంత్రులుగా ఉన్నారా? అనే ప్రజలు అనుకునే పరిస్తితి. మీడియా ముందుకొస్తే చాలు చంద్రబాబు, పవన్‌ని తిట్టడం..జగన్‌కు భజన చేయడం..అసలు తమ శాఖలకు సంబంధించి ఏం పనులు చేస్తున్నారో చెప్పారు. అందుకే వీరు ఏ శాఖలకు మంత్రులుగా చేస్తున్నారో ప్రజలకు కూడా తెలియదు.
ఇక మరి ఇలా పని చేయకుండా కేవలం తిట్టడానికే ఉన్న వీరిని ప్రజలు మళ్ళీ గెలిపిస్తారా? అంటే ఎవరైనా సరే పని చేయని నాయకులని గెలిపించడం కష్టం. పోనీ మంత్రులుగా చేసేదేమీ లేదు అనుకుంటే తమ స్థానాల్లోనైనా ఏమైనా పనులు చేస్తున్నారా? అంటే అది కనిపించడం లేదు. నగరి నుంచి రోజా రెండుసార్లు గెలిచారు. అయినా సరే అక్కడ ఒరగబెట్టింది ఏమి లేదని సొంత పార్టీ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ ఆమెకు సీటు ఇవ్వవద్దని సొంత పార్టీ వాళ్లే అంటున్నారు.

ఇక సొంత వాళ్ళే విమర్శలు చేస్తున్నారంటే..రోజా పరిస్తితి గురించి చెప్పాల్సిన పని లేదు. అటు రాంబాబు పరిస్తితి అంతే..ఎప్పుడో 1989లో గెలిచి..మళ్ళీ ఇప్పుడు 2019లో గెలిచారు. సత్తెనపల్లి నుంచి గెలిచి అక్కడ చేసేదేమీ లేదు. ఇక్కడ కూడా సొంత పార్టీ వాళ్ళే రాంబాబుని వ్యతిరేకిస్తున్నారు. మరి అలాంటప్పుడు రాంబాబు మళ్ళీ ఎలా గెలుస్తారనే అనుకోవాలి.
కానీ వీరికి మాత్రం మళ్ళీ గెలిచేస్తామనే కాన్ఫిడెన్స్ ఉంది. తమపై చంద్రబాబు వస్తాదులని పోటీకి దింపుతున్నారని ఎవరిని దింపిన గెలుపు తమదే అంటున్నారు. మరి వీరి కాన్ఫిడెన్స్‌ని ప్రజలు నిలబెడతారో..తీసేస్తారో చూడాలి. దాదాపు వీరిద్దరికి నెక్స్ట్ గెలుపు అవకాశాలు తక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు.