పొత్తు ఎఫెక్ట్: ఆ రెండు సీట్లు కావాలంటున్న జనసేన!
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే..దాదాపు రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయమని తెలుస్తోంది. చంద్రబాబు-పవన్ సైతం పొత్తుకు సిద్ధంగానే ఉన్నారని అర్ధమవుతుంది. ఇప్పటికే పవన్ పలుమార్లు వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని చెప్పిన విషయం తెలిసిందే. అటు ఈ మధ్య టీడీపీలో మాజీ మంత్రి ఆలపాటి రాజా సైతం..తనకు తెనాలి సీటుపై ఆశ లేదని చెప్పారు. అంటే ఇక్కడ జనసేన తరుపున నాదెండ్ల మనోహర్ పోటీ చేయనున్న […]