టీడీపీ ఆట మొదలు..వైసీపీపై యాంటీ ఇంత ఉందా?
రాష్ట్రంలో మార్పు మొదలైంది..ప్రజలు అధికార వైసీపీకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అర్ధమైపోతుంది. ఇప్పటివరకు అధికార బలంతో పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలని వన్ సైడ్ గా గెలిచారు. ఉపఎన్నికల్లో గెలిచారు. పథకాలు పోతాయని ప్రజలని భయపెట్టో ఏదొకరకంగా వైసీపీ గెలుపు దిశగా వెళ్లింది..ఇక ప్రలోభాలు పెట్టడం, దొంగ ఓట్ల గురించి చెప్పాల్సిన పని లేదు. అదే విధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నించారు…కనీసం 10 తరగతి చదవని వారికి గ్రాడ్యుయేట్ ఓటు వచ్చింది…వారు కూడా ఓట్లు వేశారు. […]