బెజవాడలో తెలుగుదేశం పార్టీలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో అంతటి జగన్ గాలిలో సైతం బెజవాడలో టీడీపీ కాస్త పట్టు నిలుపుకోగలిగింది. నగరంలో వైసీపీకి ధీటుగా నిలబడగలిగింది. ఒక ఎంపీ సీటు, ఒక ఎమ్మెల్యే సీటు దక్కించుకోగలిగింది. బెజవాడ ఈస్ట్ సీటుతో పాటు బెజవాడ ఎంపీ సీటుని టీడీపీ కైవసం చేసుకుంది. ఇక సెంట్రల్ సీటుని కేవలం 25 ఓట్ల తేడాతో ఓడిపోగా, వెస్ట్ సీటుని 7 వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది.

అంటే కొంతవరకు చూసుకుంటే విజయవాడలో టీడీపీ పర్వాలేదనిపించేలా ఫలితాలు తెచ్చుకుంది. కానీ నిదానంగా అక్కడ రాజకీయం అధికార వైసీపీకి అనుకూలంగా మారిపోతూ వచ్చింది. పైగా టీడీపీలో లుకలుకలు వైసీపీకి బాగా కలిసొచ్చాయై. దీంతో విజయవాడ కార్పొరేషన్‌ని వైసీపీనే కైవసం చేసుకుంది. అలా అలా విజయవాడ నగరంపై వైసీపీ పట్టు సాధించింది.

అసలు ఇప్పటికిప్పుడు బెజవాడ నగరంలో రాజకీయం ఎలా ఉందనే విషయాన్ని ఒక్కసారి గమనిస్తే….మొన్నటివరకు ఈస్ట్‌లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కు తిరుగులేనట్లే పరిస్తితి ఉండేది. కానీ ఇప్పుడు వైసీపీ నేత దేవినేని అవినాష్ వేగంగా పుంజుకున్నారు..అధికార పార్టీలో ఉండటం, ప్రజలకు కావాల్సిన పనులు చేసి పెడుతుండటంతో ఈస్ట్‌లో అవినాష్‌కు ఆదరణ పెరిగింది. అంటే గద్దెకు అవినాష్ టఫ్ ఫైట్ ఇచ్చేలా ఎదిగారు. ఈ సారి ఈస్ట్‌లో టీడీపీకి వైసీపీతో ఇబ్బందే అని చెప్పాలి.

అటు సెంట్రల్‌లో 25 ఓట్ల తేడాతో ఓడిపోయిన బోండా ఉమా..ఇప్పుడు పికప్ అయినట్లే కనిపిస్తోంది. అపోజిట్‌లో వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పనితీరుకు అనుకున్నంత మంచి మార్కులే పడటం లేదు. దీంతో సెంట్రల్‌లో టీడీపీ పరిస్తితి కాస్త మెరుగ్గానే ఉందని చెప్పొచ్చు. ఇక వెస్ట్‌లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై ప్రజా వ్యతిరేకత పెరిగిందని పలు సర్వేలు చెబుతున్నాయి.

కానీ ఆ వ్యతిరేకతని ఉపయోగించుకోలేని వరస్ట్ స్థితిలో టీడీపీ ఉంది. ఇక్కడున్న జలీల్ ఖాన్ టీడీపీ తరుపున యాక్టివ్ గా పనిచేయడం లేదు. అలాగే మరో నాయకుడుకు బాబు బాధ్యతలు అప్పగించలేదు. దీంతో వెస్ట్‌లో టీడీపీ పరిస్తితి కాస్త వరస్ట్‌గానే ఉంది.

Discussion about this post