ఔను.. చంద్రబాబు చెప్పింది అక్షర సత్యం! ఇప్పుడు ఇదే మాట టీడీపీ అభిమానుల నుంచి వినిపిస్తోంది. పార్టీలో కొత్త రక్తం ఎక్కిస్తానంటూ.. తాజాగా జరుగుతున్న మహానాడులో చంద్రబాబు ప్రకటించారు. అంతే కాదు. వచ్చే ఎన్నికల్లో 40 సీట్లను వారికే ఇస్తానని.. మరోసారి ప్రకటించారు. నిజానికి చంద్రబాబు గతంలో ఇలాంటి మాటలు చాలానే చెప్పారు. కానీ, ఎన్నికల సమయానికి మాత్రం ఆయన సీనియర్లకే అవకాశం ఇచ్చారు. కానీ, ఇప్పుడు ఈ మాటను మాత్రం పదే పదే చెబుతున్నారు.

దీనికి కారణాలు కూడా చాలానే కనిపిస్తున్నాయి. ఒకటి.. సీనియర్లను నమ్మితే… పార్టీని బతికించే నాయకు లు కనిపించడం లేదు. ఎక్కడికక్కడ వ్యాపారాలు.. వ్యవహారాల్లో మునిగి తేలుతున్న చాలా మంది సీనియ ర్లు.. అధికారంలో ఉన్న పార్టీకి అనుంగులుగా మారుతున్నారు. దీంతో పార్టీని నడిపించడం కూడా కష్టంగా మారిపోయిన పరిస్థితి గత రెండేళ్లలో చంద్రబాబు స్వయంగా చూశారు. అందుకే.. ఇప్పుడు యువతను నమ్ముకోవడానికి మించిన మార్గం లేదని ఆయన డిసైడ్ అయ్యారు.

అనుకున్న విధంగానే తాను చేస్తానని.. ఈ విషయంలో తిరుగులేదని.. ఆయన యువతకు మరోసారి మహా నాడు వేదికగానే చెప్పారు. దీనిని బట్టి.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో దాదాపు 60 స్థానాలు యువతకే కేటాయించాలని నిర్ణయించారు. ఇది యువతలో మంచి ఆశలను రేకెత్తించింది. మరోవైపు.. చంద్రబాబు ఆలోచనలను కూడా తప్పుబట్టడానికిఅవకాశం లేదని అంటున్నారు. ఎందుకంటే.. పార్టీని నడిపించే నాయకులు లేకపోవడం.. పార్టీ ఎలా పోయినా..ఫర్వాలేదు.. వచ్చే ఎన్నికల నాటికి తమకు ఇబ్బంది లేదని.. భావిస్తుండడం వంటివి పార్టీలో చర్చకు దారితీశాయి.

ఈ నేపథ్యంలోనే ఇలాంటి వారిని పక్కన పెట్టాల్సిన అవసరం ఉందనేది కొన్నాళ్లుగాపార్టీ లో చర్చకు వస్తోంది. “పార్టీకి ఎవరు ఉపయోగపడతారో.. వారికి టికెట్లు ఇవ్వడం వల్ల పార్టీకే మంచిది. ఈ పరిణామం వారికి కాదు.. పార్టీకే మంచిది.. పదికాలాల పాటు పార్టీ బతికి ఉండాలంటే.. మార్పు చాలా అవసరం. ఈ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది! చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది“ అని మహానాడుకు వచ్చిన చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

Discussion about this post