టీడీపీ అధినేత చంద్రబాబు.. గత కొన్నాళ్లుగా ముందస్తు ఎన్నికలు వస్తున్నాయంటూ.. వ్యాఖ్యానిస్తున్నా రు. అంతేకాదు.. పార్టీ కేడర్‌ను.. నేతలను కూడా ఆయన నిత్యం అలెర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఎలా ముందుకు వెళ్లాలో కూడా దిశానిర్దేశం చేస్తున్నా రు. అంతేకాదు.. పార్టీ తరఫున బాగా మాట్లాడేవారిని ప్రోత్సహిస్తున్నారు. ఇదంతా చూస్తే.. ఎన్ని కలు ఎప్పుడు వచ్చినా గెలుస్తామనే ధీమా కూడా ఆయనలో కనిపిస్తోంది. దీంతో కేడర్ కూడా పుంజుకుం టున్నారు.

నాయకులు కూడా మెల్లమెల్లగా బయటకు వస్తున్నారు. అయితే..చంద్రబాబు ఇంత ధీమా వ్యక్తం చేయ డానికి కారణం ఏంటి? ఎందుకు అలా ముందస్తుపై వ్యాఖ్యలుచేస్తున్నారు? అనేది ఆసక్తిగా మారింది. ప్ర స్తుతం రాష్ట్ర వ్యాప్తంగావైసీపీ సర్కారు సంక్షేమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. అయితే.. అదేసమ యంలో అభివృద్ది విషయంలో మందగించింది. ఎక్కడా పట్టుమని పరిశ్రమలు కానీ, పెట్టుబడులు కానీ రావడం లేదు. అయితే.. దీనికి ప్రభుత్వ లోపం లేదు. వాస్తవానికి కరోనా నేపథ్యంలో రెండు సంవత్సరాలు గా ప్రపంచ మార్కెట్ పై కలుకోలేని దెబ్బపడింది.

ఇప్పుడు తాజాగా రష్యా, ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న యుద్ధం కూడా పొరుగు దేశాల నుంచి పెట్టబడి దారులు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. డాలర్ విలువ నానాటికీ పడిపోతోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడులు రావడం లేదు. అయితే.. ఈ విషయాన్ని ప్రచారం చేసుకునే విషయంలో ప్రభుత్వ పెద్దలు కానీ, వైసీపీ నాయకులు కానీ చొరవ తీసుకోవడం లేదు. దీంతో ప్రజల్లోనూ.. అభివృద్ధి జరగడం లేదనే చర్చ సాగుతోంది. ఇదే.. టీడీపీకి బలంగా మారింది. ముఖ్యంగా పారిశ్రామిక వేత్తలు.. పెట్టుబడి దారులు అవకాశాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంకో వైపు.. యువత తమకు ఉపాధి, ఉద్యోగాలు.. కల్పించలేక పోతున్నారని.. ప్రభుత్వంపై నిప్పులు చె రుగుతున్నారు. ఇదే తమకు సరైన సమయమని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ పుంజు కుంటే.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. తమకు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అందుకే.. చంద్రబాబు పార్టీలో బూస్ట్ నింపేందుకు ముందస్తు వ్యాఖ్యలు చేస్తున్నారని చెబుతున్నారు. ఒకవేళ ముందస్తు వచ్చినా రాకున్నా.. ఖచ్చితంగా పార్టీలో అయితే.. మెరుగైన.. మార్పు మాత్రం కనిపిస్తోంది. ఇదే.. ఇప్పటికిప్పుడు చంద్రబాబు కావాల్సిన భరోసా అంటున్నారు పరిశీలకులు.

Discussion about this post