అభిమానానికి అంతు లేదు.. అనే మాటను నిజం చేశారు.. ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్. టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన దీక్షకు అద్దంకి నుంచి 300 కార్లతో ర్యాలీగా వచ్చిన గొట్టిపా టి సైన్యం .. ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిజానికి ఎంతో మంది నాయకులు అన్ని జిల్లాల నుంచి నాయకులు వచ్చినా.. గొట్టిపాటి మాత్రం ప్రత్యేకంగా నిలిచారు. దీక్ష వద్దకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. వివిధ జిల్లాల నుంచి భారీ ర్యాలీలతో నేతలు చేరుకోవటంతో ఎన్టీఆర్ భవన్ కిక్కిరిసిపోయింది.

వీరిలో ముఖ్యంగా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ ఆధ్వర్యంలో 300 కార్లలో కార్యకర్తలు చంద్రబాబు దీక్ష వద్దకు తరలివచ్చారు. ప్రకాశం జిల్లా అద్దంకిలోని టీడీపీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా మంగళగిరి చేరుకున్నారు. దీంతో అక్కడ కోలాహల వాతావరణం నెలకొంది. కార్లు బయల్దేరిన దగ్గర నుంచి డ్రోన్ల ద్వారా చిత్రీకరించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ ఎత్తున వైరల్ అవుతోంది. దాదాపు 300లకు పైగానే కార్లలో నింగి ఒంగిందా.. నేల ఈనిందా అన్న అన్నగారు ఎన్టీఆర్ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. అద్దంకి శ్రేణులు.. గొట్టిపాటి రవి ఆధ్వర్యంలో చంద్రబాబుకు మద్దతుగా.. దీక్షా స్థలికి చేరుకున్నాయి.

నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నాయకులు వచ్చినా.. ఈ రేంజ్‌లో ఇంత భారీ సైన్యంతో, ఇంత భారీ కాన్వాయ్‌తో వచ్చిన ఏకైక ఎమ్మెల్యేగా.. గొట్టిపాటి రికార్డు సృష్టించారు. ఇటు సభలోను.. అటు ప్రకాశం జిల్లాలోనూ అంతకుమించి మీడియాలోనూ గొట్టిపాటి కార్ల కాన్వాయ్ గురించే చర్చ నడిచింది. ప్రతి ఒక్కరూ దీని గురించే మాట్లాడుకున్నారు. టీడీపీ పట్ల నిబద్ధత, కార్యాచరణ.. చంద్రబాబు విషయంలో ఉన్న అంకిత భావం.. వంటివి .. ఈ ర్యాలీ ద్వారా.. గొట్టిపాటి నిరూపించారని.. ప్రతి ఒక్కరూ కొనియాడారు. ఇక, అదేసమయంలో తన ప్రసంగాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.

వైసీపీ దూకుడును అడ్డుకుంటామని.. నాడు ..చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపాలని అన్నప్పుడు.. అప్పుడు.. సీఎం స్థానంలో ఉన్నచంద్రబాబు.. రాజ్యాంగ పెద్ద అనే విషయం గుర్తుకు రాలేదా? అని గొట్టిపాటి సూటిగా ప్రశ్నించారు. జగన్, నిరంకుశ, శాడిస్టు పాలనకు కాలం మూడిందని అన్నారు. అంతేకాదు.. ప్రజావేదిక కూల్చివేతతోనే జగన్ శాడిజం బయట పడిందని చెప్పారు. గత నెలలో చంద్రబాబు ఇంటిపై దాడి చేసినప్పుడు.. ఇప్పుటు డీజీపీ ఆఫీస్‌కు కూతవేటు దూరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి చేసినప్పుడు.. పోలీసులు ఏం చేస్తున్నారని.. గొట్టిపాటి ప్రశ్నించారు. అంతేకాదు.. వచ్చేది టీడీపీ పాలనేనని.. కార్యకర్తలు ఎవరూ నిరుత్సాహం చెందాల్సిన పనిలేదని.. ధైర్యం నూరిపోశారు.

ఇలా.. మొత్తంగా చూస్తే.. నాయకులందరిలోకి .. గొట్టిపాటి ప్రత్యేకంగా నిలిచారని.. టీడీపీ నేతలు ప్రత్యేకంగా చర్చించుకున్నారు. ఇప్పటికే పార్టీ తరఫున గట్టి వాయిస్ వినిపించిన గొట్టిపాటి.. పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన దీక్షకు గట్టి మద్దతు ప్రకటించడం ద్వారా.. ఇటు జిల్లాలోనూ.. అటు రాష్ట్రంలోనూ గొట్టిపాటి సైన్యం సత్తా చాటారని.. అంటున్నారు. గొట్టిపాటి దూకుడు ప్రకాశం జిల్లా టీడీపీ శ్రేణులకు మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణుల్లోనూ సరికొత్త జోష్ నింపుతోంది.

Discussion about this post