వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావాలి. రికార్డు స్థాయిలో చంద్రబాబు మరోసారి నవ్యాం ధ్రకు ముఖ్యమంత్రి కావాలి. ఇదీ.. పార్టీలో గట్టిగా వినిపిస్తున్న మాట. అయితే.. దీనికి సంబంధించి.. పార్టీని బలోపేతం చేయడంపై చంద్రబాబు దృష్టి పెట్టారు. నాయకులను అలెర్ట్ చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేస్తున్నారు. తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు. ఇక, వచ్చే రెండు మాసాల్లో పార్టీని ప్రజల్లోకితీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు కూడా!

అయితే.. ఇది సరిపోతుందా? టీడీపీ బలోపేతం అయ్యేందుకు ఇంకా ఏదైనా చేయాలా? అనేది ఇప్పుడు చర్చకు వస్తున్న విషయం. ఎందుకంటే.. గతంలో వైసీపీ అనుసరించిన వ్యూహాన్ని పరిశీలిస్తే.. ఎన్నికలకు ముందు నుంచి పార్టీ వ్యూహాత్మకంగా అడగులు వేసింది. ఒకవైపు.. జగన్ పాదయాత్రను చేస్తూనే.. మరోవైపు.. ప్రజల్లో తాను అధికారంలోకి వచ్చేస్తున్నాననే ధీమాను వ్యక్తం చేశారు. అదేసమయంలో బైబై బాబు.. అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువచ్చారు. మాస్‌ను ఇది బాగా ఆకర్షించింది. ఇక, హామీల పరంపర కొనసాగిం చారు.

ఫలితంగా… ఇంకేముంది.. రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోతుంది… అనే చర్చను వైసీపీ విజయవంతంగా తీసుకువచ్చింది. దీంతో అప్పటి వరకు బాబుకు అనుకూలంగా ఉన్న వర్గాలు కూడా దూరమై.. వైసీపీకి చేరువయ్యాయి. కీలకమైన నాయకులు కూడా వైసీపీలో చేరిపోయారు. అంతేకాదు.. టీడీపీలో చేరుదామని వచ్చినవారు. అప్పటికే 2019 ఎన్నికల్లో టికెట్ తీసుకున్నవారు కూడా.. పార్టీ మారిపోయారు. ఇదంతా కూడా వైసీపీ ప్రకటించిన అనేక పథకాలు.. ముఖ్యంగా ఈ పార్టీ తీసుకువచ్చిన హైప్ తోనే సాధ్యమైంది.

ఇప్పుడు టీడీపీ కూడా ఇదే రేంజ్‌లో ముందుకు దూసుకువెళ్లాలని.. భావిస్తోంది. కానీ, ఇక్కడ చంద్రబాబు నాయకులను అదిలిస్తున్నారు తప్ప.. హైప్ తీసుకురాలేక పోతున్నారు. అంటే.. వచ్చే ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తాం.. అని చెప్పడం లేదు. పొత్తులు పెట్టుకుంటే వస్తామనే వ్యాఖ్యలు చేస్తన్నారు. దీంతో వైసీపీలో ఉన్న వ్యతిరేకతను తట్టుకుని ఇక్కడే ఉందాములే… టీడీపీ వస్తుందో రాదో.. అనుకునే.. నాయకులు పెరుగుతున్నారు. దీంతో టీడీపీలో ఇప్పుడు హైప్ తీసుకురావాలని సీనియర్లు కోరుతున్నారు.

Discussion about this post