వయసు మీద పడుతున్న తనలో సత్తా తగ్గలేదనే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా బాబు కష్టపడుతున్నారు…వరుసపెట్టి జిల్లాల పర్యటన చేస్తూ..పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ప్రజల్లో తిరుగుతూ, వారి సమస్యలని తెలుసుకుంటున్నారు. ఇక బాబు ఎక్కడకి వస్తే అక్కడకి ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇటీవల చోడవరంలో జరిగిన మహానాడు కార్యక్రమం కావొచ్చు…చీపురుపల్లిలో జరిగిన రోడ్ షో కావొచ్చు…ప్రజలు పెద్ద ఎత్తున చంద్రబాబు సభలకు వస్తున్నారు.

ఇక ఇదే క్రమంలో ఈ నెల చివరిలో బాబు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 29న గుడివాడలో మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు…అలాగే 30న మచిలీపట్నం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ఏడు స్థానాల్లో పార్టీని బలోపేతం చేసేలా నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. అయితే ఏడు స్థానాల్లో పార్టీ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో మచిలీపట్నం పరిధిలో ఉన్న 7 స్థానాల్లో టీడీపీ కేవలం ఒక్క గన్నవరంలోనే మాత్రమే గెలిచింది.ఇక గన్నవరంలో గెలిచిన వల్లభనేని వంశీ తర్వాత వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. దీంతో ఏడు స్థానాల్లో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మచిలీపట్నం, పెడన, గుడివాడ, పామర్రు, పెనమలూరు, అవనిగడ్డ స్థానాలు వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. అయితే ఈ సారి ఏడు స్థానాల్లో సత్తా చాటేలా బాబు…నేతలకు సూచనలు చేయనున్నారు.

ఇప్పటికే దాదాపు అన్నీ స్థానాల్లో టీడీపీ పికప్ అయిందనే చెప్పొచ్చు..గుడివాడ, గన్నవరం స్థానాల్లో కాస్త పార్టీకి పట్టు దక్కాల్సి ఉంది..ఎన్నికల నాటికి ఏడు స్థానాల్లో బలోపేతం అవ్వాల్సి ఉంది. అయితే జనసేనతో పొత్తు ఉన్నా, లేకపోయినా ఏడు స్థానాల్లో గెలిచేలా ఉండాలని బాబు, నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. చూడాలి మరి ఈ సారి టీడీపీ మచిలీపట్నం పార్లమెంట్ లో క్లీన్ స్వీప్ చేస్తుందో లేదో.
Discussion about this post